కుమార్తె వివాహ వేడుకలో ఆనందంగా డాన్స్ చేస్తున్న ఓ తండ్రి.. ఒక్కసారిగా కుప్పకూలాడు. పెళ్లి ముందు రోజు జరిగే మెహందీ కార్యక్రమంలో గుండెపోటుతో చనిపోయాడు. కూతురు పెళ్లి కళ్లారా చూడకుండానే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరాఖండ్లో ఈ విషాదకర ఘటన జరిగింది.
కుమార్తె మెహందీ వేడుకలో డాన్స్ చేస్తూ తండ్రి మృతి.. వధువుకు చెప్పకుండానే పెళ్లి - father died of a heart attack while dancing
కుమార్తె మెహందీ వేడుకల్లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు ఓ తండ్రి. ఆనందంగా స్టెప్పులేస్తూనే కుప్పకూలాడు. ఉత్తరాఖండ్లో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా తండ్రి మరణ వార్తను కూతురికి చెప్పకుండానే పెళ్లి తంతు నిర్వహించారు పెద్దలు.
బాధితుడు అల్మోడా జిల్లాకు చెందిన వ్యక్తి. శనివారం రాత్రి బాధితుడి ఇంట్లో మోహందీ వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలోనే అతడు ఆనందంగా డాన్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తేల్చారు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అయితే, తండ్రి మరణ వార్తను వధువుకు తెలియనివ్వలేదు కుటుంబ సభ్యులు. కన్యాదాన కార్యక్రమాన్ని వధువు మేనమామ నిర్వహించాడు. తండ్రి ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఆసుపత్రికి వెళ్లాడని వధువుకు చెప్పి కన్యాదానానికి ఒప్పించారు అక్కడివారు. ఆదివారం రాత్రి హల్ద్వానీలోని ఓ ఫంక్షన్ హాల్లో యువతి వివాహం పూర్తి చేశారు.