Father Daughter Killed in Transformer Blast: కర్ణాటక, బెంగళూరులో హృదయవిదారక సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ పేలి ఓ తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. శివరాజ్(55), అతని కూతురు చైతన్య (25) బెంగళూరులోని ఉళ్లాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. చైతన్య నిశ్చితార్థానికి ఫంక్షన్ హాల్‌ను బుక్ చేయడానికి స్కూటీపై వెళ్లి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మరోవైపు దాటడానికి స్కూటీని రోడ్డు పక్కనే ఆపాడు శివరాజ్. ఆ సమయంలోనే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలింది. ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ చిల్లి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి పరిస్థితి విషమంగా మారింది.
ట్రాన్స్ఫార్మర్ పేలి తండ్రి, కూతురు మృతి.. అక్కడ స్కూటీ ఆపడమే శాపమైంది! - Father Daughter Killed in Transformer Blast
Father Daughter Killed in Transformer Blast: నిశ్చితార్థానికి ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసి వస్తుండగా.. రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ పేలి ఓ తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
![ట్రాన్స్ఫార్మర్ పేలి తండ్రి, కూతురు మృతి.. అక్కడ స్కూటీ ఆపడమే శాపమైంది! Transformer blast in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14820384-thumbnail-3x2-img.jpg)
బెంగళూరులో ట్రాన్స్ఫార్మర్ పేలి తండ్రి కూతురు మృతి
క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ.. చికిిత్స పొందుతూ శివరాజ్ కాసేపటికే మృతి చెందారు. గురువారం అర్థరాత్రి సమయంలో చైతన్య కూడా మరణించారు. స్థానికంగా చాలా రోజులుగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ కారుతుందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటిికీ ఎవరూ స్పందించలేదని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యాయత్నం- కానిస్టేబుల్ సాహసం