తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Father Daughter Divorce Procession : కుమార్తెకు 'విడాకుల ఊరేగింపు'.. బ్యాండు బాజాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి - కూతురికి విడాకులు తండ్రి ఊరేగింపు

Father Daughter Divorce Procession : కుమార్తెకు ఘనంగా వివాహం చేసిన ఓ తండ్రి.. అత్తింట్లో అనుభవిస్తున్న బాధలను చూసి తట్టుకోలేక ఆమెను వినూత్నంగా పుట్టింటికి తీసుకొచ్చారు. వివాహం సమయంలో ఊరేగింపు నిర్వహించిన మాదిరిగానే.. బ్యాండు బాజాలు, టపాసుల చప్పుళ్ల మధ్య ఆమెకు స్వాగతం పలికారు.

Father Daughter Divorce Procession
Father Daughter Divorce Procession

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 7:15 PM IST

Father Daughter Divorce Procession :అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసి తట్టుకోలేక ఓ తండ్రి.. ఆమెను బ్యాండు బాజాల మధ్య ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి ఊరేగింపు నిర్వహించిన విధంగానే సంగీత వాయిద్యాలు, బాణసంచా సందడి మధ్య ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఝార్ఖండ్​లోని రాంచీలో ఈ అరుదైన ఘటన జరిగింది. అక్టోబర్ 15న జరిగిన ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే..
రాంచీలోని కైలాశ్​నగర్ కుమ్​హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు. రాంచీలోని సర్వేశ్వరి నగర్​లో నివసించే సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్​గా పనిచేస్తున్న సచిన్.. తన కుమార్తెను తరచూ వేధించేవాడని ప్రేమ్ గుప్తా ఆరోపిస్తున్నారు. వివాహం అయిన కొన్ని రోజులకే వేధింపులు మొదలయ్యాయని అంటున్నారు.

"కొన్నిసార్లు నా కుమార్తెను వారు ఇంటి నుంచి బయటకు పంపించేవారు. సచిన్​కు ఇదివరకే ఓ వివాహం అయిందన్న విషయం నా కుమార్తెకు కొద్ది నెలల క్రితం తెలిసింది. ఇది రెండో వివాహం అని అర్థమైంది. ఈ విషయం తెలిసి మా కాళ్ల కింద భూమి కంపించినంత పనైంది."
-ప్రేమ్ గుప్తా, సాక్షి తండ్రి

టపాసులు కాలుస్తూ..
రెండో వివాహం అని తెలిసినా.. అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి పేర్కొన్నారు. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్​తో జీవించి ఉండటం సాధ్యం కాదని అనుకున్నట్లు వివరించారు. అందుకే వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాన్ని సాక్షి తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు.

త్వరలో విడాకులు
తన కుమార్తె వేధింపుల నుంచి విముక్తి పొందిందని, ఆ ఆనందంతోనే ఇలా ఘనంగా ఇంటికి తీసుకొని వచ్చినట్లు సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా వివరించారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సచిన్​తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు సాక్షి. కాగా, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించేందుకు సచిన్ సైతం అంగీకరించారు. త్వరలోనే వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Viral Video Father and Daughter Duo Cute Dance : కూతురుతో కలిసి తండ్రి డ్యాన్స్​.. క్యూట్​ ఎక్స్​ప్రెషన్​కు నెటిజన్లు ఫిదా!

ప్రేమించిన వ్యక్తి కోసం.. రూ.2వేల కోట్ల ఆస్తి వదులుకున్న బిజినెస్ టైకూన్​ కూతురు

ABOUT THE AUTHOR

...view details