తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు పిల్లలతో బైక్​పై తండ్రి ప్రయాణం- ఆసుపత్రిలో ఆరో కుమారుడు- పోలీసులకు ఫన్నీ సమాధానం

Father Caught Riding With 5 Kids On Bike : ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ సమీపంలో ఒక వ్యక్తి తన ఐదుగురు పిల్లలను తీసుకుని ప్రమాదకరంగా బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇంతమందిని తీసుకుని ఎక్కడకు వెళ్తున్నావ్​ అని ప్రశ్నించగా.. అతడి సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.

Father Caught Riding With 5 Kids On Bike :
Father Caught Riding With 5 Kids On Bike :

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 10:54 PM IST

Father Caught Riding With 5 Kids On Bike : ఒక వ్యక్తి తన ఐదుగురు పిల్లలతో బైక్​పై హెల్మెట్​ లేకుండా వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఇంతమంది చిన్నారులను బైక్​పై కూర్చోబెట్టుకుని ఎక్కడకి వెళ్తున్నావని పోలీసులు.. అతడిని ప్రశ్నించారు. దానికి అతడు ఇచ్చిన సమాధానం విని నవ్వుకోవడం పోలీసుల వంతైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అక్కడ ఏమైంది? అంతమంది చిన్నారులను ఎందుకు తీసుకెళ్తున్నాడంటే?

ఒక్క బైక్​పై ఇంతమందా అని పోలీసుల ఆశ్చర్యం
లఖ్​నవూ-అయోధ్య హైవేపై చౌపులా సమీపంలో శుక్రవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పుడు పోలీసు సిబ్బందిలో ఒకరు.. ఒకే బైక్​పై ఆరుగురు వెళ్లడం చూసి ఆపాడు. ఆ బైక్​పై నడిపే వ్యక్తికి ముందు ఇద్దరు పిల్లలు, వెనుక ముగ్గురు చిన్నారులు కూర్చున్నారు. బైక్ నడిపే వ్యక్తితో కలిపి మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఒకే ద్విచక్ర వాహనంపై ఇంత మంది వెళ్లడం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రోడ్డు మీద వెళ్తున్న ఇతరులు కూడా అతడిని వింతగా చూశారు.

ఐదుగురు పిల్లలతో బైక్​పై తండ్రి

బైక్ నడిపే వ్యక్తి సమాధానం విని నవ్వుకున్న పోలీసులు!
హెల్మెట్ పెట్టుకోకుండా ఇంత మంది పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నావని బైకర్​ను పోలీసులు ప్రశ్నించారు. దీనికి అతడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తన భార్య ఆసుపత్రిలో చేరిందని.. అక్కడ ఆరో కుమారుడికి జన్మనిచ్చిందని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. బైక్​పై ఉన్న ఐదుగురు కూడా తన పిల్లలేనని.. వీరంతా తమ కొత్త సోదరుడిని చూడాలనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అందుకే వారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను అని పోలీసులకు వివరించాడు. ఇది విన్న పోలీసు సిబ్బంది పగలబడి నవ్వుకున్నారు. అయితే, ప్రమాదకర రీతిలో చిన్నారులను బైక్​పై అలా తీసుకెళ్లడం సరికాదని అతడిని పోలీసులు మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించినందుకు చలానా జారీ చేశారు.

బైక్​పై ఎద్దును తీసుకెళ్తూ..
చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటారు. వాటి ఆలనా పాలన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడైనా బయటకు వెళ్తే వాటిని తమ వాహనాల్లోనూ తీసుకెళ్తుండటం మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఎద్దును తన బైక్​పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందిది. మరి ఆ వీడియో ఏంటో చుద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details