శిశువుకు పోలియో టీకా (Polio News) వేయించేందుకు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయలేదు ఓ తండ్రి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వరదకు ఎదురీదాడు. కుంభవృష్టి వల్ల వాహనాలు నడవలేని పరిస్థితిలో.. ఓ పాత్రలో పాపాయిని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ అపురూప సంఘటన ఝార్ఖండ్‌లో (Jharkhand News) జరిగింది.
ఏం జరిగిందంటే?
సాహిబ్‌గంజ్ జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం (Pulse Polio Campaign) జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతమైన సిర్సా గ్రామానికి వైద్యుల బృందం చేరుకుంది. ఈ క్రమంలో తన శిశువుకు టీకా (Polio Vaccine) వేయించాలాని భావించిన ఓ తండ్రికి.. కుండపోత వర్షంలో ఏ ఒక్క వాహనం లభించలేదు. పైగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని అతడు దాటాల్సి ఉంది. దీంతో చిన్నారిని ఓ పాత్రలో పెట్టి, వరదను దాటుకుంటూ ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడతడు.