తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురిపై నాలుగు నెలలుగా అత్యాచారం.. మైనర్​పై గ్యాంగ్​రేప్​ - ఛత్తీస్​గఢ్ న్యూస్

రాజస్థాన్​ కోటాలో దారుణం జరిగింది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. బాధితురాలి స్నేహితురాలు ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో ఓ మైనర్​పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ జశ్​పుర్​లో జరిగింది.

father raped daughter
father raped daughter

By

Published : Jul 12, 2022, 9:48 AM IST

Updated : Jul 12, 2022, 10:15 AM IST

కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లోని కోటాలో జరిగింది. అట్రు పట్టణంలోని 31ఏళ్ల తండ్రి తన 15 ఏళ్ల కూతురిపై గత నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక తల్లి మూడేళ్ల కింద చనిపోగా నిందితుడు.. మరో వివాహం చేసుకున్నాడు. తర్వాత మద్యానికి బానిస కావడం వల్ల ఆమె కూడా వెళ్లిపోయింది. నాటి నుంచి రోజు తాగి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి స్నేహితురాలు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడం వల్ల పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

మైనర్​పై సామూహిక అత్యాచారం: ఛత్తీస్​గఢ్​ జశ్​పుర్​లో దారుణం జరిగింది. ఓ మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. ఈ ఘటన జులై 9న జరగగా ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేశామని.. విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు.

బాలికపై అత్యాచారం చేసిన ప్రధానోపాధ్యాయుడు: మరోవైపు ఇదే పట్టణంలో మరో మైనర్​ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. బాలిక చదువు మానేయడం వల్ల తన ఇంట్లోనే పనిమనిషిగా పెట్టుకున్నాడు నిందితుడు రామకృష్ణయాదవ్​. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక గర్భం దాల్చడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మైనర్లపై అత్యాచారం చేసిన 59 ఏళ్ల వృద్ధుడు: ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దిల్లీలో జరిగింది. బయట ఆడుకుంటున్న బాలికలకు చాక్లెట్లు ఇస్తానంటూ ఆశచూపి అత్యాచారం చేశాడు 59 ఏళ్ల వృద్ధుడు. బాధితుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుల స్టేట్​మెంట్​ను తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

అమ్మ, నానమ్మ కర్కశం.. బాలిక నోట్లో మట్టి నింపి.. శ్మశానంలో పాతిపెట్టి..

కాంగ్రెస్​ నేత దారుణ హత్య.. పట్టపగలే పదునైన ఆయుధాలతో..

Last Updated : Jul 12, 2022, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details