తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెంపుడు కుక్క మొరిగిందని గొడవ.. యజమానిపై కాల్పులు

dispute over dog barking: పెంపుడు శునకం మొరుగుతోందన్న కోపంతో దాని యజమానిపై కాల్పులు జరిపారు ఇద్దరు వ్యక్తులు. ఈ విషయంపై తరచూ గొడవ పెట్టుకుంటున్న నిందితులు.. మంగళవారం ఏకంగా తుపాకీకి పనిచెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.

three shot on dispute over dog barking in ghaziabad
three shot on dispute over dog barking in ghaziabad

By

Published : Apr 14, 2022, 10:32 AM IST

dispute over dog barking: పక్కింటి పెంపుడు కుక్క మొరుగుతోందని ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబంపై కాల్పులు జరిపారు. ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోని బాపూధామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెంపుడు కుక్క యజమానితో పాటు అతడి ఇద్దరు కుమారులపై నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. నిందితులను అఠన్నీ, చవాన్నీగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఆస్పత్రిలో బాధితుడు

బాధితుడు సుశీల్​ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, కుక్క పదేపదే అరుస్తోందని నిందితులు తరచుగా కోప్పడేవారు. ఇదే విషయంలో మంగళవారం గొడవ జరగ్గా.. నిందితులు సుశీల్​పై కాల్పులు చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చాక్లెట్​ కోసం డబ్బులిచ్చి మరో ఘటనలో..

ABOUT THE AUTHOR

...view details