తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం - హరియాణాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

హరియాణాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ తండ్రి అతని ఇద్దరు కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి.. ఆపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. రెండు నెలలపాటు తనను అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.

repe
అత్యాచారం

By

Published : Nov 5, 2021, 9:48 AM IST

హరియాణా పానిపత్​ జిల్లాలో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై పొరుగుంట్లో ఉంటున్న తండ్రీకొడుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టారాని బాధితురాలు తెలిపింది.

రెండు నెలలుగా అత్యాచారం​.. అసలేమైంది?

బాధితరాలు.. పానిపత్​లోని మోడల్​ టౌన్​లో కుటుంబ సభ్యులతో నివసిస్తుంది. తన ఇంటిపక్కనే ఉంటున్న అజయ్​ అనే యువకుడు.. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. కొన్నాళ్లు తర్వాత ఆ చిన్నారి కూడా అజయ్​తో ప్రేమలో పడింది. ఆ బాలికను అజయ్​ తన ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే ఇంట్లో ఉన్న అజయ్​ తండ్రి సదర్​, అతని సోదరుడు అర్జున్​.. మత్తుమందుతో కూడిన సిగరెట్​ కాల్చమని ఆమెను బలవంతం చేశారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అజయ్​ను పెళ్లిచేసుకుంటానని ఆ బాలిక చెప్పగానే.. ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలల పాటు బాలికను తమ ఇంట్లోనే బంధించి రాక్షసంగా కామ వాంఛ తీర్చుకున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్​కు బానిసైన బాధితురాలి మానసిక ఆరోగ్యం క్షీణించింది. అయితే ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న బాధితరాలు.. విషయాన్ని తల్లికి చెప్పింది.

తన కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారని పలుమార్లు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. అయితే వారు పట్టించుకోలేదని ఆరోపించింది. రెండు నెలల తర్వాత బాధితురాలు ఇంటికి చేరుకున్నా.. ఆమెకు ఎలాంటి వైద్యపరీక్షలు చేయించలేదు. దీంతో సీఎం నివాసానికి వెళ్లారు తల్లీకూతుళ్లు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి.. అజయ్​, అర్జున్​, సదర్​, అజయ్​ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:దీపావళి ఎఫెక్ట్​.. దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

ABOUT THE AUTHOR

...view details