తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతురు.. వైమానిక దళ చరిత్రలోనే.. - Father and daughter flew a fighter plane together

భారత వైమానిక దళం చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటు చోసుకుంది. తండ్రీకూతురు కలిసి ఓ ఫైటర్ జెట్​ను నడిపారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతురుగా రికార్డు సాధించారు.

యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు
యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు

By

Published : Jul 6, 2022, 4:34 AM IST

భారత వైమానిక దళం చరిత్రలో ఇదో అరుదైన సంఘటన. ఎయిర్ కమొడోర్‌ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ కలిసి ఫైటర్‌ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతురుగా నిలిచారు. ఆ ఇద్దరు కలిసి ఫైటర్‌ జెట్‌ ముందు ఫోజులిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

1989లో వైమానిక దళంలో చేరిన తన తండ్రి సంజయ్‌ శర్మ అడుగుజాడల్లోనే నడిచింది అనన్య శర్మ. తానూ సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని నిశ్చయించుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె.. వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ల బృందం (2016)లో చోటు సంపాదించింది. అనంతరం ఫ్లయింగ్ బ్రాంచ్‌ శిక్షణకు ఎన్నికైంది. కఠిన శిక్షణ పొంది గతేడాది డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా నియామకం పొందింది.

మే 30వ తేదీన కర్ణాటకలో బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతురు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఓ మిషన్‌ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి అని వైమానిక దళం వెల్లడించింది. తండ్రి సంజయ్‌తో కలిసి ఒకే యుద్ధ విమానంలో ప్రయాణించడంతో అనన్య కల సాకారమైనట్లయ్యింది. అనన్య ప్రస్తుతం బీదర్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది. తండ్రీకూతురు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details