ఒడిశాలో విషాదకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కళాశాల విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు దుండగులు. తొలుత ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి.. ఆ తర్వాత ఇంటిని తగులబెట్టి పరారయ్యారు.
ఇదీ జరిగింది..
కటక్‌లో కళాశాల విద్యనభ్యసిస్తోన్న ఓ బాలిక.. తల్లిదండ్రులతో కలిసి మాన్సింగ్పట్నాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది.
ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. అనంతరం.. కాళ్లు, చేతులను కట్టేసి.. ఇంటి వెనుకనుంచి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిపోతున్న ఆ అమ్మాయిని రక్షించారు స్థానికులు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం ఎస్సీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థినిని 15 రోజుల క్రితం.. ఓ యువకుడు బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:13 నెలల బిడ్డ తల నరికి.. తల్లి ఆత్మహత్య