తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లావుగా ఉన్నావంటూ భార్యకు చిత్రహింసలు.. అది మనసులో పెట్టుకొని.. - ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా భార్య

లావుగా ఉందని, అందంగా లేదని చెబుతూ తన భార్యను తీవ్రంగా హింసించాడు ఓ వ్యక్తి. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత భార్యపై కోపం పెంచుకొని చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. ఆ దారుణం బిహార్​లో జరిగింది. మరోవైపు, ఓ యువకుడు గొంతు కోసుకొని రోడ్డు పక్కన కూర్చోవడం కలకలం రేపింది.

fat wife husband strangulation
fat wife husband strangulation

By

Published : Jun 10, 2023, 5:44 PM IST

బరువు అధికంగా ఉందని భార్యను చిత్రహింసలు పెడుతున్నాడో భర్త. రోజూ విచక్షణారహితంగా ఆమెను కొడుతున్నాడు. ఇద్దరు కుమార్తెలు పుట్టడంపైనా అతడు ఆగ్రహం పెంచుకున్నాడు. దీంతో భర్త, అతడి కుటుంబ సభ్యులు.. ఆ మహిళను తీవ్రంగా హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు భర్త. గొంతునులిమి చంపేయాలని భావించాడు. బిహార్​లోని తాజ్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిండీ గ్రామంలో జరిగిందీ ఘటన.

బాధితురాలు సుశీలా దేవి స్వస్థలం పతేపుర్ వైశాలి. భిండీ గ్రామానికి చెందిన గోవింద్ సహానీకి ఇచ్చి ఆమెకు వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన కొద్దిరోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ, వరుసగా ఇద్దరు కుమార్తెలు జన్మించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సుశీలకు, గోవింద్​కు మధ్య గొడవలు మొదలయ్యాయి. లావుగా ఉన్నావని, అందవిహీనంగా ఉన్నావని చెబుతూ రోజూ కొట్టేవాడు. అత్తింటివారు సైతం ఆమెతో అనుచితంగా ప్రవర్తించేవారు.

ఈ క్రమంలోనే ఇటీవల సుశీలను గోవింద్ తీవ్రంగా కొట్టాడు. గొంతు నులిమి చంపేయాలని ప్రయత్నించాడు. సుశీల గట్టిగా అరిచేసరికి.. ఇరుగుపొరుగున్న ఉన్నవారంతా వచ్చి ఆమెను కాపాడారు. సుశీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి సుశీలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కొనసాగుతోందని సుశీల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సమస్తీపుర్ డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే స్పష్టం చేశారు.

గొంతు కోసుకొని రోడ్డు పక్కన...
బంగాల్ జల్పాయ్​గుడిలో ఓ యువకుడు గొంతుకోసుకొని రోడ్డు పక్కన కూర్చోవడం కలకలం రేపింది. శరీరం నుంచి రక్తం కారుతూ ఉన్న అతడిని చూసి స్థానికులు హడలిపోయారు. దగ్గరికి వచ్చిన స్థానికులపై యువకుడు దాడి చేశాడు. మయాంగురి రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కత్తితో గొంతు కోసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే కూర్చున్న అతడు.. రక్తం ఎక్కువ పోవడం వల్ల కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. చిక్కుల్లో ఇరుక్కుంటామన్న భయంతో కొంతమంది అతడిని ముట్టుకునేందుకు వెనకడుగు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిని జల్పాయ్​గుడి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు జల్పాయ్​గుడి ఏఎస్పీ వందేన్ భూటియా తెలిపారు.

అసహజ శృంగారానికి ఐఏఎస్ యత్నం!
తెలంగాణ కేడర్​కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఛత్తీస్​గఢ్​లోని కోర్బా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య చేసిన ఆరోపణల మేరకు కోర్టు ఈ మేరకు ఆదేశించింది. గృహ హింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడని అధికారి భార్య పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఐఏఎస్​పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సందీప్ కుమార్​ స్వస్థలం బిహార్​లోని దర్భంగా జిల్లా. ఆయనకు 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతితో వివాహం అయింది. కోటికి పైగా ఖర్చు చేసి వివాహం జరిపించినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున బంగారం, ఆభరణాలు తీసుకురావాలని తన భర్త డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. పెళ్లికి ముందు, తర్వాత కట్నం కోసం ఆయన హింసించారని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details