తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పంట బీమా పథకం 'పీఎం ఫసల్ బీమా యోజన'.. ప్రకృతి విపత్తులతో వచ్చే పంట నష్టాన్ని తగ్గించి కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫసల్ బీమా యోజన ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేశారు.
" ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రారంభించిన పీఎం ఫసల్ బీమా యోజన ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం బీమా కవరేజీని పెంచింది. నష్టం ముప్పును తగ్గించింది. కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ పథకం లబ్ధిదారులందరినీ నేను అభినందిస్తున్నా."