తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా భార్య అలిగింది.. హోలీకి అత్తింటికి వెళ్లకపోతే అంతే'.. పోలీసు రాసిన లీవ్ లెటర్ వైరల్

ప్రతి మనిషి జీవితంలో ఉద్యోగం, కుటుంబం అనేవి చాలా ముఖ్యం. రెండూ సరిగ్గా మేనేజ్ చేసినప్పుడే జీవితం బాగుంటుంది. కానీ ఉద్యోగ రీత్యా కొన్ని సమస్యల వల్ల సరిగ్గా సెలవులు అనేవి దొరకవు. కానీ వాటి ప్రభావం కుటుంబం మీద తప్పక ఉంటుంది. అలాంటిదే సంఘటనే ఇది. పెళ్లైన 22ఏళ్ల నుంచి హోలీ రోజున పుట్టింటికి తీసుకెళ్లలేదని భార్య అలిగింది. దీంతో తన బాధను వివరిస్తూ ఎస్పీకి ఓ పోలీసు రాసిన లేఖ వైరల్​గా మారింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

farrukhabad inspector leave letter goes viral in uttarapradesh
10రోజులు సెలవు కావాలని కోరిన పోలీసు అధికారి

By

Published : Mar 5, 2023, 1:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పోలీసు అధికారి సెలవు కోసం రాసిన లేఖ వైరల్ అయ్యింది. గత 22ఏళ్లుగా తన భార్య హోలీకి తన పుట్టింటికి వెళ్లనందుకు అలిగిందని.. ఆమెను శాంతపరచాలంటే 10రోజులు సెలవు కావాలని పోలీస్ ఇన్స్​స్పెక్టర్ లేఖ రాశారు.
ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఇన్​స్పెక్టర్.. సెలవు కోరుతూ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనాకు బుధవారం లేఖ రాశారు. పోలీసు ఉద్యోగం కారణంగా ఇన్​స్పెక్టర్​కు సెలవులు దొరకడం లేదు. వివాహమైన 22 ఏళ్ల నుంచి తన భార్యను హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లలేదు. అందుకే ఆమె తనపై కోపంగా ఉందని, ఆమెను శాంతింప చేయడానికి హోలీకి 10రోజులు సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన రాసిన లేఖ ప్రస్తుతం వైరల్​గా మారింది.

10రోజులు సెలవు కావాలని కోరిన పోలీసు అధికారి

"నా భార్య హోలీ రోజున నాతో పాటు కలిసి తన తల్లి ఇంటికి వెళ్లాలనుకుంటోంది. కచ్చితంగా నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను పరిగణనలోకి తీసుకొని మార్చి4 నుంచి.. 10రోజుల పాటు సెలవు ఇవ్వాలని వినయపూర్వకంగా కోరుతున్నాను" అని ఇన్స్​స్పెక్టర్ రాసిన లేఖను ఎస్పీ అశోక్ కుమార్ మీనా చదివారు. లేఖ చదివిన తర్వాత ఎస్పీ మీనా.. పెద్దగా నవ్వినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, చివరకు ఇన్​స్పెక్టర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నారు మీనా. ఇన్​స్పెక్టర్ కోరినట్టుగా పది రోజులు కాకుండా.. ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు.

ఇదే తరహా మరొకటి
అయితే, ఉద్యోగులు ఇలాంటి విచిత్రంగా సెలవుల కోసం దరఖాస్తులు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజగంజ్‌లో కొత్తగా పెళ్లయిన కానిస్టేబుల్.. తన భార్య ఫోన్​ ఎత్తడం లేదని పేర్కొంటూ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు కూడా ఆ లేఖ విషయం తెగ వైరల్ అయింది.
ఉత్తర్​ప్రదేశ్ మౌ జిల్లా నివాసి, ఇండో-నేపాల్ సరిహద్దు పీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విచిత్రంగా లీవ్ లెటర్ రాశారు. 'సెలవు పెట్టి తనతో పాటు పుట్టింటికి రాలేదని భార్య కోపంతో ఉంది. పుట్టింటికి వెళ్లిన భార్యకు ఫోన్ చేస్తే ఆమె మాట్లాడటం లేదు. నా భార్య మాట్లాడకుండా ఫోన్​ను వాళ్ల అమ్మకు ఇచ్చింది. ఇంటికి రాలేదనే కోపంతోనే నా భార్య నాతో మాట్లాడటం లేదు. అందుకే నాకు సెలవు కావాలి' అని కోరుతూ లేఖ రాశారు కానిస్టేబుల్. అప్పుడు కూడా ఉన్నతాధికారులు ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. స్థానిక అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. కానిస్టేబుల్‌కు 5 రోజుల సెలవు మంజూరు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details