అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంపై (Afghan Taliban) జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్పర్సన్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌లోని ప్రజల ప్రాథమిక హక్కులను తాలిబన్లు గౌరవిస్తారని (Taliban respect woman) ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
"అఫ్గానిస్థాన్ వేరే దేశం. అధికారంలోకి వచ్చిన వారు ఆ దేశాన్ని సక్రమంగా పాలించాలి. అందరికీ న్యాయం చేస్తారని, మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారని నేను ఆశిస్తున్నా. మానవ హక్కుల అంశాన్ని వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇస్లాం నిబంధనల ప్రకారం పాలన సాగించాలి. ఇతర దేశాలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి."