Farooq Abdullah Resignation: జమ్ముకశ్మీర్లో ప్రధాన పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేశారు. మంగళవారం నాయకులతో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సమావేశం జరిగిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన తన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
పార్టీ అధ్యక్ష పదవికి ఫరూక్ రాజీనామా.. తదుపరి పగ్గాలు ఒమర్కేనా? - జమ్మూ కశ్మీర్ ఫరూఖ్ అబ్దుల్లా లేటెస్ట్ న్యూస్
దశాబ్దాల కాలంపాటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఓమర్ అబ్దుల్లా గెలిచే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
![పార్టీ అధ్యక్ష పదవికి ఫరూక్ రాజీనామా.. తదుపరి పగ్గాలు ఒమర్కేనా? Farooq Abdullah resigned from the post of National Conference President](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16961898-thumbnail-3x2-gsdgd.jpg)
ఫరూఖ్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా
అయితే పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబరు 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా కొనసాగుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా గెలిచే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.