వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు దిల్లీ సరిహద్దు నుంచి వెనుదిరిగేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ పునరుద్ఘాటించారు. రాజస్థాన్ అల్వార్‌లో నిర్వహించిన కిసాన్ పంచాయత్‌కు హాజరైన ఆయన.. ఇలాంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపడతామని ఈటీవీ భారత్‌తో చెప్పారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్న టికాయిత్... తమను అడ్డుకునేందుకు రోడ్లపై కేంద్రం ఏర్పాటు చేసిన మేకులను ఒక్కొక్కటిగా తొలగించిన తర్వాతే దిల్లీని వీడతామని స్పష్టం చేశారు.
రైతుల ఉద్యమానికి అపకీర్తి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు టికాయిత్. రైతులు ఎర్రకోట వద్దకు చేరుకున్నారే తప్ప.. అక్కడి నుంచి పాలన సాగించలేదని వ్యాఖ్యానించారు.