తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భారత్ బంద్​- అప్రమత్తమైన పోలీసులు - రాకేశ్​ టికాయిత్

కేంద్ర తీసుకువచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు.. నేడు దేశవ్యాప్త బంద్​కు(Bharat Bandh) పిలుపునిచ్చాయి. ఈ బంద్​లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశాయి. రైతుల ఆందోళన(Bharat Bandh) నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

Bharat Bandh
భారత్ బంద్

By

Published : Sep 27, 2021, 5:04 AM IST

Updated : Sep 27, 2021, 7:02 AM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాలు(Farmers Protest).. నేడు భారత్ బంద్​కు(Bharat Bandh) పిలుపునిచ్చాయి. సాయంత్రం 4 గంటల వరకు సాగే ఈ బంద్‌లో(Bharat Bandh) రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్​కేఎం) విజ్ఞప్తి చేసింది. 10 నెలలుగా ఉద్యమిస్తున్న తాము అవసరమైతే పదేళ్ల పాటు దాన్ని కొనసాగించేందుకు సిద్ధమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌(Rakesh Tikait) స్పష్టం చేశారు.

"10 నెలలుగా ఉద్యమిస్తున్న మేము అవసరమైతే పదేళ్లపాటు దాన్ని కొనసాగించడానికి సిద్ధమే. కానీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు కానిచ్చేది లేదు. డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తాం. రైతులంతా ట్రాక్టర్లను సిద్ధం చేసుకోవాలి."

-రాకేశ్​ టికాయిత్​, భారతీయ కిసాన్ యూనియన్ నేత.

రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు(Bharat Bandh) సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌సహా పలు విపక్షాలు ప్రకటించాయి. రైతులతో కలిసి ఇందులో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్​పీ, బీఎస్​పీ, వామపక్షాలు తెలిపాయి.

అప్రమత్తం..

మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండియా గేట్‌, విజయ్‌ చౌక్‌ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసన శిబిరాల నుంచి దేశ రాజధానిలోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:మద్దతు ధరతోనే.. రైతు భద్రతకు రాజమార్గం!

Last Updated : Sep 27, 2021, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details