నవంబరు 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో.. ఆరోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా(Faremrs tractor rally suspended) వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)(Samyukta kisan morcha) తెలిపింది. శనివారం దిల్లీలో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం(Skm tractor rally) తీసుకుంది. తదుపరి కార్యాచరణపై వచ్చే నెలలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీలో ఎస్కేఎం నేత దర్శన్పాల్.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"సోమవారం నిర్వహించాలని భావించిన ట్రాక్టర్ ర్యాలీని మేం వాయిదా వేస్తున్నాం. రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి మేం లేఖ రాశాం. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం స్మారక భవనం నిర్మించేందుకు భూమి కేటాయించాలని కోరాం. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను పదవి నుంచి తొలగించడం సహా వివిధ అంశాలను లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకువెళ్లాం."
-దర్శన్పాల్, ఎస్కేఎం నేత