జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్భవన్లను ముట్టడిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఆ రోజును 'కేతి బచావో, లోక్తంత్ర బచావో' (వ్యవసాయాన్ని కాపాడండి- ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) దివస్‌గా జరుపుకుంటామని పేర్కొంది(Farmers protest).
"1975 జూన్ 25న నాటి ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు కూడా దాదాపు అంతే ఉన్నాయి. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. అదే సమయంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి 7 నెలలు కావస్తోంది. జూన్ 26న కేతి బచావో-లోక్తంత్ర బచావో దివస్ జరుపుతాం. రాజ్భవన్లను ముట్టడిస్తాం."