వ్యవసాయ చట్టాలను(Farmers protest) రూపొందించి ఏడాది గడుస్తున్న సందర్భంగా.. జూన్ 5న చట్టాల ప్రతులను మంటల్లో కాల్చివేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ ప్రకటించారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్ వెళ్లిన టికాయిత్.. బాబా అనూప్ సింగ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. రైతులలో(Farmers protest) స్ఫూర్తిని నింపడానికి ధర్నా చేశారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్నాలు కొనసాగిస్తున్న ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక ఇళ్ల స్థానంలో కాంక్రీట్ భవనాలను పునఃనిర్మిస్తామని రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు.