తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులతో కొలిక్కిరాని చర్చలు-5న మరోసారి కేంద్రం భేటీ

Fourth round of talks today
రైతు దీక్ష: కేంద్రంతో నాలుగో దఫా చర్చలు

By

Published : Dec 3, 2020, 8:01 AM IST

Updated : Dec 3, 2020, 7:53 PM IST

19:37 December 03

డిసెంబర్​ 5న మరోసారి చర్చలు..

  • రైతు సంఘాల తో ముగిసిన కేంద్రం చర్చలు
  • మరోసారి అసంపూర్తిగానే ముగిసిన చర్చలు
  • దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు
  • ఎల్లుండి మరోమారు కొనసాగనున్న చర్చలు

17:07 December 03

రైతులకు ఏఐపీఈఎఫ్​ మద్దతు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు.. అఖిల భారత విద్యుత్​ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్​) మద్దతుగా నిలిచింది. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్​ చేసింది. 

16:50 December 03

సుదీర్ఘంగా చర్చలు..

  • రైతు సంఘాలతో సుదీర్ఘంగా కొనసాగుతున్న కేంద్రం చర్చలు
  • దాదాపు నాలుగున్నర గంటల నుంచి కొనసాగుతున్న చర్చలు
  • భోజన విరామ సమయం వరకు అభ్యంతరాలను వినిపించిన రైతు సంఘాలు
  • ప్రైవేటు మార్కెట్లకు అనుమతి ఇస్తే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో వివరించిన రైతు సంఘాలు
  • కొత్త చట్టాల ప్రభావంపై వివిధ పత్రికా కథనాలను సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం
  • చట్టాలను వెనక్కి తీసుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టం తేవాలన్న రైతు సంఘాలు
  • చట్టం రూపకల్పనకు ముందు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్​
  • భోజన విరామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆహారం తీసుకునేందుకు రైతు సంఘాల నిరాకరణ
  • స్వతహాగా ఆహారాన్ని తెప్పించుకున్న రైతు సంఘాల నేతలు
  • భోజన విరామం తర్వాత రైతుల అభ్యంతరాలపై సమాధానం ఇస్తున్న కేంద్రం

15:28 December 03

'కేంద్రం భోజనం మాకొద్దు'

రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. లంచ్​ బ్రేక్​ సందర్భంగా.. రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. 'కేంద్రం ఇచ్చే భోజనం, టీ కానీ మాకొద్దు' అంటూ రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.  

15:20 December 03

రైతుసంఘాలతో సుదీర్ఘ భేటీ..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలతో రెండోసారి సమావేశమైంది కేంద్రం. చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. 

మరోవైపు .. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపర్చాలని డిమాండ్​ చేశారు. 

మంగళవారం చర్చల సందర్భంగా.. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో.. నేడు జరుగుతున్న భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

విపక్షాలు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. శిరోమణి అకాలీదళ్​ నేత, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్​ బాదల్​ తన పద్మవిభూషణ్​ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. 

13:32 December 03

'పద్మ విభూషణ్​'ను తిరిగిచ్చిన పంజాబ్​ మాజీ సీఎం

రైతులకు సంఘీభావంగా పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని తిరిగి ఇచ్చారు.

13:24 December 03

భీమ్​ ఆర్మీ అధినేత సంఘీభావం

భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్ రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, ప్రజలు వీధుల్లోకి రావాలని చంద్రశేఖర్​ ఆజాద్ పిలుపునిచ్చారు. చివరి వరకు రైతలకు అండగా నిలుస్తామన్నారు.

13:19 December 03

కొనసాగుతున్న కేంద్రం చర్చలు

  • రైతు సంఘాలతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు
  • కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ నేతృత్వంలో చర్చలు
  • రైతు సంఘాల నేతల అభ్యంతరాలపై సమావేశంలో చర్చలు

12:00 December 03

అమిత్​ షాతో భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ భేటీ అయ్యారు. సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అమరీందర్​ సింగ్.. అమిత్​షాతో చర్చలో లేవనెత్తే అవకాశం ఉంది. 

11:54 December 03

రిపబ్లిక్​ డే పరేడ్​లో..

కేంద్రంతో చర్చలు ఫలిస్తాయని కొందరు రైతు సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నేెరవేర్చకపోతే రిపబ్లిక్​ డే పరేడ్​లో పాల్గొంటామని అన్నదాతలు హెచ్చరించారు.

11:45 December 03

40 మంది రైతుల సంఘాల నేతలు కేంద్రంతో చర్చలకు విజ్ఞాన్​ భవన్​కు చేరుకున్నారు. కాసేపట్లో సమావేశం జరగనుంది. అయితే ఈ కీలక భేటీకి ముందు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.. కేంద్ర హోంమంత్రి అమిత్​షా ను కలిశారు.

11:35 December 03

  • కాసేపట్లో రైతు సంఘాలతో చర్చలు జరపనున్న కేంద్రం
  • సింఘు సరిహద్దు నుంచి విజ్ఞాన్ భవన్‌కు వెళ్లిన రైతు సంఘాల నేతలు
  • కొత్త చట్టాలపై అభ్యంతరాలతో కేంద్రమంత్రికి లేఖ పంపిన రైతు సంఘాలు
  • కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనం లేదన్న రైతు సంఘాలు
  • కార్పొరేట్లకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయన్న రైతు సంఘాలు
  • కార్పొరేట్లకు స్వేచ్ఛతో నియంత్రణ వారి చేతుల్లోకి వెళ్తుంది: రైతు సంఘాలు
  • ప్రైవేటు మార్కెట్లకు అనుమతి.. ప్రభుత్వ మార్కెట్లను నీరుగార్చడమే: రైతు సంఘాలు
  • ప్రైవేటు మార్కెట్లలో న్యాయపర రక్షణ అవకాశాలు లేవు: రైతు సంఘాలు
  • కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతు సంఘాలు
  • విద్యుత్ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి: రైతు సంఘాలు
  • ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతు సాధికారతకు ఊతమివ్వాలి: రైతు సంఘాలు
  • కొత్త చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం: రైతు సంఘాలు

11:32 December 03

దిల్లీ-ఘజిపుర్​ సరిహద్దు వద్ద రైతులు ఆందోళన చేపట్టడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఘజిపుర్​ సరిహద్దును నిర్బంధించవద్దని రైతులను పోలీసులు కోరుతున్నారు.

10:53 December 03

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్..​ రైతులతో భేటీ కోసం ఆయన నివాసం నుంచి బయల్దేరారు.

10:41 December 03

భారీగా మోహరింపు..

సింఘు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈరోజు కేంద్రంతో రైతులు చర్చించనున్న నేపథ్యంలోనే అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.

10:34 December 03

దిల్లీ ఘజిపుర్​ సరిహద్దు వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

10:30 December 03

కేంద్రంతో మధ్యాహ్నం జరగనున్న భేటీకి హజరయ్యేందుకు రైతు సంఘాల నేతలు దిల్లీకి బయల్దేరారు. 

"మొత్తం 35 మంది నాయకులు ప్రభుత్వంతో సమావేశానికి హాజరవుతాం. మేము చదువుకున్న రైతులం. ఏది మంచో మాకు తెలుసు. ఈ నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే మాకు కావాలి."

     - రైతు సంఘాల నేతలు

09:02 December 03

దిల్లీలో 8వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతు సంఘాలతో మరో దఫా కేంద్రమంత్రుల చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రైతు సంఘాలతో చర్చలు జరపనుంది కేంద్రం. ఈ నెల 1న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. వ్యవసాయ చట్టంపై రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్రమంత్రులు తెలిపారు.

అయితే చట్టాల రద్దు తప్ప మరేదీ సమ్మతం కాదని రైతు సంఘాలు తెలిపాయి. ఇవాళ్టి చర్చల్లో అంశాలవారీగా అభ్యంతరాలు వివరిస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి.

08:52 December 03

సింఘు సరిహద్దులో రైతులు చేస్తోన్న ఉద్యమానికి రాజస్థాన్​కు చెందిన అన్నదాతల బృందం మద్దతు తెలిపింది. దిల్లీ-హరియాణా సరిహద్దులో వీరు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

"దాదాపు 500 మంది రైతులు రాజస్థాన్​ నుంచి ఇక్కడకు త్వరలోనే చేరుకుంటారు. ఎమ్​ఎస్​పీని ఉంచుతామని ప్రధాని చాలా సార్లు చెప్పారు. మరి అదే మాట లిఖితపూర్వకంగా ఇస్తే తప్పేంటి?"

       - రైతులు

07:50 December 03

రైతు దీక్ష: కేంద్రంతో నాలుగో దఫా చర్చలు

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. ఈనెల 1న జరిపిన చర్చల్లో చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు.

ఇవాళ రైతులతో నాలుగో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో బుధవారం భేటీ అయ్యారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో అమిత్ షా భేటీ కానున్నట్లు సమాచారం. కొన్నిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఈ ఉదయం ఇరువురి మధ్య సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని రైతు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలను రద్దు చేసేందుకే పార్లమెంట్‌ భేటీ కావాలన్నారు. కేంద్ర ప్రభుత‌్వంతో ఇవాళ జరిగే చర్చల్లో అంశాలవారీగా అభ్యంతరాలను వివరిస్తామని చెప్పారు.

Last Updated : Dec 3, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details