రైతుల ఆందోళనల నేపథ్యంలో సింఘు సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు అధికారులు.
దిల్లీ సరిహద్దులో రైతుల ఉపవాస దీక్ష - farmers agitation
10:19 January 30
10:17 January 30
టిక్రీ సరిహద్దులో 66వ రోజూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిరసనలు జరగుతున్న ప్రదేశంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.
09:48 January 30
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపుర్ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునే వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
09:17 January 30
దిల్లీ సరిహద్దులో రైతుల ఉపవాస దీక్ష
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన మహాత్ముడి వర్ధంతి రోజూ కొనసాగుతోంది. ఉద్యమంపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రాకేశ్ టికాయిత్ గురువారం రాత్రి కన్నీరు పెట్టు కోవడం, ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించడం.. రైతుల్ని తీవ్రంగా కదిలించింది. దీంతో సరిహద్దు ప్రాంతాలకు రైతన్నలు మళ్లీ తరలివస్తున్నారు. మరింత ఎక్కువ సంఖ్యలో మునుపటి ఆందోళన ప్రదేశాలకు చేరుకుంటున్నారు.
సాగు చట్టాలను రద్దు చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని. రైతు నేతలు కేంద్రానికి మరోమారు స్పష్టం చేశారు. మహాత్మగాంధీ వర్థంతిని పురస్కరించుకొని.. సద్భావన దినంగా పాటించాలని రైతులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాసదీక్షను అన్నదాతలు చేపట్టారు. అటు..గణతంత్ర ఘటనతో వెనక్కి తగ్గిన పలు రైతు సంఘాలు సైతం... తిరిగి ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించటం వల్ల సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఊపందుకుంది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి ప్రకటించింది. గణతంత్ర పరేడ్‌లో జరిగిన హింస నేపథ్యంలో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించిన బీకేయూ-ఎల్ నోయిడాలో మళ్లీ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాకేశ్ టికాయిత్‌కు సంఘీభావంగా గాజీపూర్ సరిహద్దుకు భారీగా రైతన్నలు చేరుకున్నారు. సాగు చట్టాలని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా పంజాబ్ బతిండా లోని విర్‌కుద్ధ్ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకరి చొప్పున రైతు ఉద్యమానికి పంపాలని తీర్మానించింది. ఆదేశాలు పాటించని వారికి 15వందల రూపాయల జరిమానా విధించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. జరిమాన చెల్లించని యెడల వారిని గ్రామం నుంచి వెలివేయనున్నట్లు చెప్పారు.