తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు'

Farmer protest in Delhi
దిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

By

Published : Dec 23, 2020, 9:05 AM IST

Updated : Dec 23, 2020, 6:47 PM IST

18:31 December 23

'రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర'

తమ ఉద్యమానికి సంబంధం లేని రైతులుగా చెప్పుకునే నేతలు, సంఘాలతో ప్రభుత్వం తరుచుగా చర్చలు చేపడుతోందని పేర్కొన్నారు స్వరాజ్​ ఇండియా నేత యోగేంద్ర యాదవ్​. కేంద్రానికి రైతుల సంఘాల సమాఖ్య రాసిన లేఖలో గట్టి హెచ్చరికలు పంపారు. అలాంటి చర్చలు తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమేనని ఆరోపించారు. ప్రతిపక్షాలను చూసినట్లుగానే రైతులను కేంద్రం చూస్తోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలో వస్తే.. ప్రభుత్వంతో చర్చలు చేపట్టేందుకు రైతులు, రైతు సంఘాలు ఎప్పుడూ సిద్ధమేనని కేంద్రానికి తెలిపారు. కేంద్రం పంపిన చర్చల ఆహ్వాన లేఖను తప్పుపట్టారు రైతులు. ఈ అంశంపై దిల్లీ సరిహద్దుల్లో సమావేశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్రానికి లేఖ రాశారు. 

" ఈ చర్చల ప్రక్రియను కేంద్రం చేపడుతున్న తీరు.. ఈ అంశాన్ని ఆలస్యం చేయాలని, నిరసన తెలిపే రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మా సమస్యలను ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, సత్వరం పరిష్కారం కనుగొనాలని వారిని హెచ్చరిస్తున్నాం."

  - యుధ్​వీర్​ సింగ్​, భారతీయ కిసాన్​ సంఘ్​

18:05 December 23

అప్పటివరకు పోరాటం ఆగదు: రైతుసంఘాలు

  • చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖను తప్పుపట్టిన రైతుసంఘాలు
  • రైతులను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారని వెల్లడి
  • సాగు చట్టాలు రద్దు చేసేవరకూ మా పోరాటం ఆగదు: రైతుసంఘాలు
  • కేంద్రం కుయుక్తులు మాని సరైన ప్రతిపాదనలతో రావాలి: రైతుసంఘాలు
  • ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోంది: రైతుసంఘాలు
  • మా ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే ఈ కుట్రలు: రైతుసంఘాలు
  • రైతులు చర్చలకు సిద్ధంగా లేరని చేసే ప్రచారం అవాస్తవం: రైతుసంఘాలు

18:00 December 23

ముగిసిన సమావేశం

  • ముగిసిన రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం
  • చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖను తప్పుపట్టిన రైతుసంఘాలు
  • రైతులను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారని వెల్లడి

13:09 December 23

  • సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతల సమావేశం
  • కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లాలా లేదా నిర్ణయం తీసుకోనున్న రైతు సంఘాలు
  • చర్చల పునరుద్ధరణపై ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

11:59 December 23

  • మధ్యాహ్నం ఒంటి గంటకు రైతు సంఘాల భేటీ
  • సింఘు సరిహద్దు వద్ద సమావేశం కానున్న రైతు సంఘాల నేతలు
  • కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లాలా లేదా నిర్ణయం తీసుకోనున్న రైతు సంఘాలు
  • చర్చల పునరుద్ధరణపై ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
  • దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

11:06 December 23

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు గాజీపుర్​లో దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లో యాగం నిర్వహించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

చరణ్ సింగ్ జయంతి(డిసెంబర్ 23) నాడు భారత్​లో ఏటా రైతు దినోత్సవం జరుపుకుంటారు. 

08:33 December 23

దిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

  • 28వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
  • కొనసాగుతున్న రైతు సంఘాల నేతల రిలే నిరాహారదీక్షలు
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల వద్ద బైఠాయించిన రైతులు
  • కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • నేడు సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల కీలక భేటీ
  • కేంద్రం రాసిన లేఖపై నిర్ణయం తీసుకోనున్న రైతు సంఘాలు
  • సరైన పరిష్కార మార్గంతో వస్తే చర్చలకు సిద్ధమంటున్న రైతు సంఘాలు
  • నేడు రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని పిలుపు

ఇదీ చదవండి:'ఈ చట్టాలు వ్యవసాయంలో కొత్త యుగానికి నాంది'

Last Updated : Dec 23, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details