వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ శివారుల్లో ఆందోళనలు చేపట్టి ఆరునెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటించనున్నారు. ఈ సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయక్త కిసాన్ మోర్చ పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్కేఎం ఓ ప్రకటన విడుదల చేసింది. 'బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ పండగను జరుపుకోవాలని' కోరింది.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి..
లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఎక్కడా గుంపులు చేరకూడదని రైతులకు దిల్లీ పోలుసులు సూచించారు. సరిహద్దుల్లో గస్తీ పెంచినట్లు తెలిపారు. దిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తుండడంపై దిల్లీ, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపించింది. ఆందోళనలు జరిగే చోట్ల కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.
ఇదీ చూడండి :రైతులకు మద్దతుగా సిద్ధూ ఇంటిపై నల్లజెండాలు