తెలంగాణ

telangana

రైతన్నకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు

By

Published : Jan 26, 2021, 7:38 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనకు దిగారు. దిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ ఆందోళనలు చేపట్టారు. హరియాణాలో దిల్లీ-జైపుర్​​ ఎక్సప్రెస్​వే వద్ద రైతులు ధర్నా చేశారు. బంగాల్​లో వామపక్ష నేతలు కవాతు నిర్వహించారు. కర్ణాటకలోనూ రైతు ఆందోళనలు జరిగాయి.

Farmers stage protest against the three agriculture laws in various states
రైతులకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో నిరసనలు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలు రాష్ట్రాల్లోని అన్నదాతలు నిరసనలు తెలిపారు. హరియాణా మానేసర్‌లోని దిల్లీ-జైపుర్ ఎక్స్‌ప్రెస్​వే వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులు నిరసనకు దిగారు.

ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించిన అన్నదాతలు

బంగాల్​లో..

బంగాల్​లో​నూ రైతు ఆందోళనలు జరిగాయి. కోల్​కతాలోని క్రిసక్​ సంహతి పరేడ్​లో వామపక్ష నేతలు కవాతు నిర్వహించారు. వామపక్షాలకు చెందిన 16 పార్టీలు.. దిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు.

బంగాల్లో ర్యాలీ చేపట్టిన వామపక్షాలు

కర్ణాటకలోనూ..

కర్ణాటకలోనూ రైతులు ఆందోళనలు చేశారు. దిల్లీలోని రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి బెంగళూరుకు చేరుకున్న రైతులు నిరసనలకు దిగారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు.

కర్ణాటకలో నిరసనల్లో పాల్గొన్న రైతులు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​ చండీగఢ్​లో నిరసన ర్యాలీలు నిర్వహించారు రైతులు. దిల్లీలోని రైతుల ట్రాక్టర్​ ర్యాలీకి మద్దతుగా యువత బైక్​ ర్యాలీ నిర్వహించారు.

రైతులకు మద్దతుగా బైక్​ ర్యాలీ

ఇంటికి పయనం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముంబయిలోని ఆజాద్​ మైదానంలో భారీ సభకు హాజరైన రైతులు ఇంటిముఖం పట్టారు. నిరసనల్లో పాల్గొన్న ఓ వృద్ధురాలు.. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తమ స్వస్థలాలకు తిరిగు పయణమయ్యారని అఖిల భారత కిసాన్​ సభ తెలిపింది.

ఇదీ చూడండి:ట్రాక్టర్​ ర్యాలీలో హింసపై షా సమీక్ష

ABOUT THE AUTHOR

...view details