పార్లమెంటులో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు(Farm laws Repeal Bill) ఆమోదం పొందడం.. రైతులు సాధించిన విజయం అని పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల నేతలు(Punjab farmer leaders) అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తదుపరి కార్యాచరణ కోసం డిసెంబరు 1న సంయుక్త కిసాన్ మోర్చా(Samyukta kisan morcha meeting) అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
పంటలకు కనీస మద్దతు ధర, రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడం సహా తమ ఆరు డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై(Farmer demands to center) స్పందించేందుకు కేంద్రానికి మంగళవారం వరకు సమయం ఉందని చెప్పారు. ఈ మేరకు సింఘు సరిహద్దులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం..