తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే - వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టులో వాదనలు

The Centre on Monday moved the Supreme Court seeking an injunction against the proposed tractor or trolley march or any other kind of protest which seeks to disrupt the august gathering and celebrations of the Republic Day on January 26.

Supreme court final verdict on new Agri laws
నూతన సాగు చట్టాలపై సుప్రీం కోర్టు తుది తీర్పు

By

Published : Jan 12, 2021, 12:42 PM IST

Updated : Jan 12, 2021, 2:15 PM IST

13:43 January 12

కమిటీ ఏర్పాటు

నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.  నలుగురు సభ్యులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. 

కమిటీలో సభ్యులుగా వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ అశోక్‌ గులాటి, జాతీయ వ్యవసాయ అకాడమీ మాజీ డైరెక్టర్‌ ప్రమోద్‌ జోషి, హర్సిమ్రత్ మాన్, భూపేంద్ర సింగ్‌ మాన్‌, అనిల్‌ ధన్వంత్‌ ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.

13:35 January 12

సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

13:33 January 12

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌కు వచ్చేందుకు రైతులు అనుమతి కోరారా? అని సీజే ప్రశ్నించారు. రైతులు ఢిల్లీలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతించలేదని రైతుల తరపు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు.  

నిషేధిత సంస్థలు ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నాయన్న సమాచారంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజేను కోరిన ఆదేశించిన సీజే. రైతుల ట్రాక్టర్ ర్యాలీని నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై రైతు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.  

13:24 January 12

ఆందోళనకు నిషేధిత సంస్థ సాయం చేస్తోందని మాకు పిటిషన్ వచ్చిందని సుప్రీం పేర్కొంది. నిషేధిత సంస్థ సాయం ఆరోపణలను ఒప్పుకుంటారా? ఖండిస్తారా? అని సర్కార్​ను ప్రశ్నించింది. ఆందోళనల్లో ఖలీస్థానీలు చొరబడ్డారని ఇప్పటికే చెప్పామని సొలిసిటర్ జనరల్ సమధానమిచ్చారు. అయితే పూర్తి వివరాలతో రేపటిలోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది.

రేపు చనిపోయే బదులు ఈ రోజు చనిపోవడానికి సిద్దంగా ఉన్నామని రైతులు ప్రకటించినట్లు న్యాయవాది శర్మ వివరించారు. అయితే ఈ వ్యవహారాన్ని జీవిన - మరణ కేసుగా చూడటం లేదని సీజే స్పష్టం చేశారు. చట్టం చెల్లుబాటు కావాలా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రజలు మిగిలిన సమస్యలను కమిటీ ముందు లేవనెత్తవచ్చుని సీజే చెప్పారు. కమిటీ ఏర్పాటు కోసం మాజీ సీజే కెహర్‌ పేరును న్యాయవాది శర్మ సూచించారు. 

13:09 January 12

క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకే కమిటీ వేయాలని అనుకుంటున్నామని సుప్రీం వ్యాఖ్యానించింది. సమస్యలను పరిష్కరించడంలో నిజంగా ఆసక్తి ఉన్న అందరూ.. కమిటీకి ముందుకు వెళ్లాలని పేర్కొంది. రైతులు ప్రభుత్వం ముందుకు వెళ్ళగలిగితే కమిటీ ముందుకు ఎందుకు వెళ్లరని సీజేఐ ప్రశ్నించారు.

"ఎటువంటి పరిష్కారం లేకుండా ప్రదర్శన చేయవలసి వస్తే.. అది నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఉండదు. పరిష్కారం కోసమే ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. షరతులతో చట్టాన్ని సస్పెండ్ చేయాలనుకుంటున్నాం. అయితే అది నిరవధికంగా కాదు."

                            - సుప్రీం

12:55 January 12

వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని ఒక్క మాట కూడా రైతులతో మాట్లాడటం లేదని అన్నదాతల తరఫు న్యాయవాది శర్మ సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ విషయంలో తాము ఏమి చెప్పలేమన్న సీజేఐ వ్యాఖ్యానించారు. కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని సుప్రీం పేర్కొంది. తమకు నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వ్యాఖ్యానించింది.

12:51 January 12

"సాగు చట్టాలపై పూర్తిగా తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రైతులు కమిటీ దగ్గరకు వెళ్లరు అనే వాదనలు మేం వినదలచుకోలేదు. మేం సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాం. మీరు (రైతులు) నిరవధిక నిరసన చేస్తామంటే అది మీ ఇష్టం."

        - సుప్రీం

12:46 January 12

  • వాదనలు ప్రారంభించిన న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ
  • రైతులతో స్వయంగా మాట్లాడినట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన న్యాయవాది శర్మ
  • కమిటీ ముందు హాజరుకాబోమని రైతులు చెప్పినట్లు కోర్టుకు తెలిపిన శర్మ
  • సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుకుంటున్నారన్న న్యాయవాది శర్మ
  • మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు
  • కమిటీ నియమించే అధికారం తమకు ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు
  • చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు

12:43 January 12

  • నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ
  • నూతన సాగు చట్టాలపై ఉత్తర్వులు వెలువరించనున్న సుప్రీంకోర్టు
  • సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టు మాజీ సీజే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీం
  • సుప్రీంకోర్టు మాజీ సీజేలు, జడ్జిల జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టుకు జాబితా అందజేయనున్న అటార్నీ జనరల్‌
  • రైతులతో కేంద్రం వ్యవహరించిన తీరుపై నిన్న సుప్రీంకోర్టు అసంతృప్తి
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
  • కేంద్రం సాగు చట్టాలు నిలిపివేయకపోతే స్టే ఇస్తామన్న సుప్రీంకోర్టు
  • రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన తొలగే దాకా స్టే విధిస్తామన్న సుప్రీం
  • సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు

11:44 January 12

తుది తీర్పు నేడే

నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి  సుప్రీంకోర్టులో తుది విచారణ ప్రారంభమైంది. సోమవారం జరిగిన విచారణలో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి అవసరమైతే మాజీ సీజే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించే వారి జాబితాను అటార్నీ జనరల్ సర్వోన్నత న్యాయస్థానానికి అందజేయనున్నారు.

Last Updated : Jan 12, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details