తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీకి రైతులు.. నిరంకారి మైదానంలో నిరసనకు సిద్ధం - Delhi Police

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 'ఛలో దిల్లీ' కార్యక్రమం చేపట్టిన రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించారు. పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించినా.. బెదరని పంజాబ్, హరియాణా రైతులు ఎట్టకేలకు దిల్లీలో అడుగుపెట్టారు. బురారిలోని నిరంకారి సమాగం మైదానంలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించగా.. టిక్రి సరిహద్దు నుంచి దిల్లీకి చేరుకున్నారు రైతులు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

Farmers' protest LIVE: Farmers from Punjab, Haryana reach near Delhi borders; situation tense
దిల్లీ చేరుకున్న అన్నదాతలు

By

Published : Nov 27, 2020, 9:13 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 'ఛలో దిల్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతులు.. ఎట్టకేలకు దేశరాజధానిలోకి ప్రవేశించారు. దిల్లీ వెళ్లేందుకు అంగీకరించిన అక్కడి పోలీసులు.. తమ పహారాలోనే వారంతా నగరంలోకి రావాలని షరతు విధించారు. దిల్లీలోని పెద్ద మైదానాల్లో ఒకటైన బురారిలోని నిరంకారి సమాగం మైదానంలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి టిక్రీ సరిహద్దు గుండా రైతులు దిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. అయితే సింఘూ సరిహద్దు నుంచి మాత్రం రైతుల ప్రవేశానికి పోలీసులు అనుమతివ్వలేదు.

దిల్లీ చేరుకుంటున్న అన్నదాతలు
దిల్లీ చేరుకున్న రైతులు
దిల్లీకి పయనం

దిల్లీలో నిరంకారి మైదానంలో ప్రవేశించిన రైతులు అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అన్నదాతల కోసం భోజనం తయారు చేసుకున్నారు.

భోజనం తయారు చేస్తుకుంటున్న రైతులు
మైదానంలో రైతుల వంటా వార్పు

అంతకుముందు.. దిల్లీలోకి ప్రవేశించేందుకు పంజాబ్‌, హరియాణా తదితర చోట్ల నుంచి వచ్చిన వేలాది మంది రైతుల్ని నిలువరించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. సింఘూ సరిహద్దు ప్రాంతం నుంచి దిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు జల ఫిరంగులు, బాష్ప వాయువు ప్రయోగించారు. టిక్రి సరిహద్దుల్లో పోలీసులు, అన్నదాతలకు మధ్య ఘర్షణ తలెత్తింది. భద్రతా సిబ్బంది అడ్డుగా ఏర్పాటు చేసిన ట్రక్కును చైన్‌తో కట్టి ట్రాక్టర్ సాయంతో రైతులు తొలగించారు.

రైతులను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది
రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
బారీకేడ్లను తొలిగిస్తున్న రైతులు

అన్నదాత నిరసనలతో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రజలకు పలు సూచనలు చేశారు. బాహ్యవలయ రహదారి, ముక్బార్ చౌక్, జీటీకే రోడ్డు, 44 నెంబరు జాతీయ రహదారి, సింఘూ బోర్డర్‌ నుంచి ప్రయాణాలను విరమించుకోవాలని కోరారు. ఆల్‌ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ నిరసనల నేపథ్యంలో వాహనాలను దారిమళ్లించారు.

రైతుల నిరసనలతో నిలిచిపోయిన ట్రాఫిక్​
అన్నదాతల కోసం సిద్ధమవుతున్న మైదానం

మరోవైపు రైతుల నిరసన ప్రదర్శన సందర్భంగా హరియాణా భివానీ జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్‌పై రైతులు ప్రదర్శనగా దిల్లీ వెళ్తుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీ కొనడం వల్ల తీవ్రగాయాలై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.

ఇవీ చూడండి:

'ఛలో దిల్లీ'కి పోలీసులు ఓకే- రైతుల హర్షం

మోదీ... ఇది ఆరంభం మాత్రమే: రాహుల్

రైతుల 'ఛలో దిల్లీ' మార్చ్​లో​ మరోసారి ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details