తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులు ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం' - శరద్ పవార్ మోదీ సాగు చట్టాల చర్చలు

దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తోన్న రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని, రైతులు ఫోన్ చేస్తేనే ముందుకెళ్లే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు, ప్రధాని స్వయంగా చర్చల్లో పాల్గొనాలని ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు.

Farmers' protest: Govt ready to resume talks, says Piyush Goyal
'ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం'

By

Published : Feb 7, 2021, 9:48 PM IST

దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తోన్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి ఒక్క ఫోన్​కాల్ దూరంలోనే ఉందన్న మోదీ ప్రకటనను ప్రస్తావించారు. అయితే చట్టాలు రద్దు చేయమనడం మినహా రైతులు వేరే బలమైన ప్రతిపాదనతో ముందుకురావడం లేదని అన్నారు.

"రైతుల సమస్యలపై ప్రభుత్వం సున్నితంగానే ఉంది. వారితో చర్చించేందుకు ప్రభుత్వం, ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఒక్క ఫోన్​కాల్ దూరంలోనే ఉన్నానని మోదీ సైతం చెప్పారు. ఎవరైనా ఫోన్ చేస్తేనే మేం ముందుకెళ్లగలం."

-పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి

కొన్ని అంశాలపై రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని గోయల్ పేర్కొన్నారు. చట్టాల్లో నిబంధనలు మార్చి వాటిని మరింత పటిష్టం చేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు అందించిందని చెప్పారు. రోజు తర్వాత రోజు(చర్చలకు నిర్ణయించిన తేదీలపై) అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందుకు బదులుగా ప్రతిపాదన మీద ప్రతిపాదన అని రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై ఏవైనా సమస్యలు ఉంటే వారే లేవనెత్తాలని, ఇతరుల ప్రయోజనాలకు భంగం కలిగించకూడదని అన్నారు. దేశంలోని కోట్ల మంది రైతులకు ఈ సాగు చట్టాలు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు.

ప్రధాని చర్చించాలి: పవార్

మరోవైపు, రైతులతో స్వయంగా ప్రధాని చర్చలు జరపాలని ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. సీనియర్ కేబినెట్ మంత్రులైన రాజ్​నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు చర్చల్లో భాగం కావాలని కోరారు. చర్చల ద్వారానే సాగు చట్టాల అమలుపై ఉన్న ప్రతిష్టంభన వీడుతుందని అన్నారు. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న పీయూష్​ గోయల్​కు సాగు చట్టాల గురించి ఎంతవరకు తెలుసో తనకు తెలీదని అన్నారు.

వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని, ఆయా ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతే చట్టాలను తయారు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి వ్యవసాయ సంస్కరణలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిగేవని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details