తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిసెంబర్​ 8న భారత్​ బంద్​- రైతు సంఘాల పిలుపు

Farmers protest
రైతుల ఆందోళన.. దిల్లీలో ట్రాఫిక్‌ కష్టాలు

By

Published : Dec 4, 2020, 11:02 AM IST

Updated : Dec 4, 2020, 5:46 PM IST

17:34 December 04

డిసెంబర్​ 8న భారత్​ బంద్​..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఆ చట్టాలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని.. సమావేశం అనంతరం వెల్లడించారు భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి హెచ్​ఎస్​ లాఖోవాల్​. 

  • డిసెంబర్​ 5న దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు వెల్లడించారు.
  • ఆందోళనలను ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాల నిర్ణయం
  • రేపు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపు
  • డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
  • కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్​
  • విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని డిమాండ్

16:17 December 04

రైతులను తరలించాలని పిటిషన్​..

  • దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్​
  • పిటిషన్ దాఖలు చేసిన దిల్లీ వాసి రిషబ్ శర్మ
  • దేశ రాజధానిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పెద్దఎత్తున రైతులు గుమికూడటం కోరడం ప్రమాదకరమన్న పిటిషన్​దారు
  • రైతులను అనుమతిచ్చిన మైదానానికి తరలించాలన్న పిటిషనర్​
  • మైదానంలో కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్న పిటిషనర్ రిషబ్​
  • దిల్లీ సరిహద్దుల్లోని రహదారులను తెరవాలన్న పిటిషనర్

10:44 December 04

రైతుల ఆందోళన.. దిల్లీలో ట్రాఫిక్‌ కష్టాలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరావట్లేదు. గురువారం ఎనిమిది గంటల పాటు సంప్రదింపులు జరిగినా ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో చర్చలను శనివారానికి వాయిదా వేయడంతో హస్తిన సరిహద్దుల్లో అన్నదాతల నిరసన కొనసాగుతూనే ఉంది. వరుసగా 9వ రోజు దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై బైఠాయించిన రైతులు శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీ సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు కూడా కొనసాగుతోంది.  

దిల్లీ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు..

రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు ఎదురయ్యాయి. శుక్రవారం కూడా సింఘు, టిక్రి, లాంపూర్‌,సఫియాబాద్‌, సబోలి తదితర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. 44వ జాతియరహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించారు. ఝతికరా సరిహద్దులో కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలతో దూరం పెరగడమేగాక, రద్దీ కూడా విపరీతంగా ఉంటుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు దిల్లీ-యూపీ మార్గాన్ని కూడా రైతులు నిర్బంధించారు. 

మరోవైపు రైతుల ఆందోళనకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి. అన్నదాతలకు తమ మద్దతు తెలిపిన ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ నేడు దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనే అవకాశముంది. 

దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం రైతులు, కేంద్ర మంత్రులకు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. మూడు చట్టాల్లోని అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది. అయితే కేంద్రం వివరణను రైతు నాయకులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయని రైతులు తమ వాదన వినిపించారు. అయితే ఈ అంశంపై నిర్ణయం తేలకపోవడం వల్ల శనివారం మరోమారు భేటీ కానున్నారు.

Last Updated : Dec 4, 2020, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details