తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు- విజయ యాత్రతో స్వస్థలాలకు - విజయ్​ దివాస్​

Farmers Protest End: సుదీర్ఘ నిరసనలకు తెరదించుతూ దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. పెండింగ్​ డిమాండ్లపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందిన క్రమంలో ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించిన అన్నదాతలు.. స్వస్థలాలకు పయనమయ్యారు. ట్రాక్టర్లను అందంగా ముస్తాబు చేసి విజయ యాత్ర చేపట్టారు. పలువురు రైతులు నృత్యాలు చేశారు.

farmers-protest-end
దిల్లీ సరిహద్దులను ఖాళీ చేసిన రైతులు

By

Published : Dec 11, 2021, 12:03 PM IST

Updated : Dec 11, 2021, 1:10 PM IST

దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు

Farmers protest end: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలను విరమించిన రైతులు అధికారికంగా శిబిరాలను ఖాళీ చేస్తున్నారు. దిల్లీ సింఘు, టిక్రీ, గాజీపుర్​ సరిహద్దుల వద్ద శిబిరాల తొలగింపు అనధికారికంగా.. గత గురువారమే ప్రారంభమైంది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఇళ్లకు బయలుదేరారు. గుడారాలు, శిబిరాలను తొలగించి సామాన్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు.

టెంట్లను తొలగిస్తున్న రైతులు
నిరసన ప్రాంతాలను ఖాళీ చేస్తున్న కర్షకులు

విజయ యాత్ర..

ట్రాక్టర్లను అందంగా అలంకరించుకుని గ్రామాలకు వెళ్తున్నారు అన్నదాతలు. ట్రాక్టర్లకు రైతు జెండాలు ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ విజయ యాత్ర చేపట్టారు. కిలోమీటర్ల పొడవున రహదారిపై రైతుల ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి.

ఇళ్లకు బయలుదేరిన రైతులు

రైతుల నృత్యాలు..

సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో విజయంపై సంతోషం వ్యక్తం చేశారు రైతులు. డిసెంబర్ 11ని విజయ్ దివస్​గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. పలువురు రైతులు సంతోషంతో నృత్యాలు చేశారు. గాజీపుర్​ సరిహద్దులో రైతులు స్వీట్లు పంచి, వేడుకలు చేసుకున్నారు.

నృత్యాలు చేస్తున్న అన్నదాతలు

సింఘు సరిహద్దులో ఇళ్లకు బయలుదేరే ముందు ఓ కార్యక్రమం నిర్వహించారు రైతులు. ఉద్యమ విజయంపై వివిధ పాటలు పాడారు. నృత్యాలు చేశారు.

కన్నీటి పర్యంతమైన రైతు

సాగుచట్టాల రద్దు సహా తాము లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారంపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందడంతో రైతు సంఘాలు తమ ఆందోళనను ముగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. జనవరి 15న మరోసారి సమావేశమై ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చిందో లేదో చర్చిస్తామని రైతు నేతలు చెప్పారు. ఈ ఏడాది కాలంలో తమకు సహకరించిన వారిని సన్మానిస్తామని తెలిపారు

గుడారాలను తొలగిస్తున్న రైతులు

సింఘులో ట్రాఫిక్​కు అనుమతి

సింఘు సరిహద్దులను రైతులు ఖాళీ చేస్తున్న క్రమంలో.. కేఎంపీ పైవంతెన వద్ద వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్​ కారణంగా.. నెమ్మదిగా వెళ్తున్నాయి.

సింఘు సరిహద్దు వద్ద ట్రాఫిక్​
సింఘు సరిహద్దు కేఎంపీ పైవంతెన వద్ద వాహనాలు

ఇదీ చూడండి:Farmers protest end: సుదీర్ఘ నిరసనలకు తెర- ఇళ్లకు రైతులు

Last Updated : Dec 11, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details