రైతులతో చర్చపై కేంద్రం ప్రకటన విడుదల..
- రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలపై ప్రకటన విడుదల చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ.
- రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రైతు సంఘాల ప్రతినిధులకు చెప్పిన కేంద్ర మంత్రులు.
- పరస్పర అంగీకారంతో రైతుల సమస్యలను పరిష్కరించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం.
- ఈ విషయంపై.. స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి ప్రభుత్వంతో మరోసారి చర్చలకు హాజరుకావాలని సూచన వచ్చింది: వ్యవసాయ శాఖ
- పరస్పర చర్చల్లో.. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను గుర్తించి, పరిశీలన కోసం రేపు సాయంత్రంలోపు ప్రభుత్వానికి ఇవ్వాలని రైతు సంఘాల నేతలను కోరిన ప్రభుత్వం.
- ఈనెల 3న జరిగే.. సమావేశంలో రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం.
- రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రులు