తెలంగాణ

telangana

రైతు హక్కులను కాపాడాలని సుప్రీంకు విద్యార్థుల లేఖ

By

Published : Jan 4, 2021, 9:46 PM IST

రైతుల నిరసనపై భారత ప్రధాన న్యాయమూర్తికి పంజాబ్ విద్యార్థులు లేఖ రాశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారని లేఖలో పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడాలని సీజేఐను కోరారు.

Farmers' protest: 35 Panjab University students write to CJI, seek probe into police atrocities
రైతులు హక్కులను కాపాడాలని సుప్రీంకు విద్యార్థులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు పంజాబ్‌ విద్యార్థులు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారని, లాఠీఛార్జి చేశారని లేఖలో పేర్కొన్నారు. హరియాణా ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని విద్యార్థులు అన్నారు. రైతుల హక్కులను కాపాడాలని సీజేఐను కోరారు.

అయితే.. విద్యార్థులు రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఇదీ చదవండి :పట్టు వీడని రైతులు- మెట్టు దిగని కేంద్రం

ABOUT THE AUTHOR

...view details