నూతన సాగు చట్టాలకు వ్యతిరేకిస్తూ.. దిల్లీ సరిహద్దుల్లో గత నవంబర్ నుంచి అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం.. రోడ్డుపై పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు రైతులు. కానీ, స్థానిక పాలనాయంత్రాంగం అడ్డుకుంది. దీంతో చేసేదేమీ లేక ఇన్నాళ్లూ ట్రాక్టర్లలనే ఆవాసాలుగా మార్చుకుని జీవనం సాగించారు. అయితే.. ప్రస్తుతం పంట కాలం కావడం వల్ల.. ట్రాక్టర్లన్నీ పొలాలకు వెళ్లాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి.. వారికి విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు అన్నదాతలు. వెంటనే ఇలా గుడిసెల నిర్మాణం చేపట్టారు.
దిల్లీ సరిహద్దులో అన్నదాతల గుడిసెలు - అన్నదాతల ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. సింఘు వద్ద గుడిసెలను నిర్మించుకుంటున్నారు. ఇన్నాళ్లూ ట్రాక్టర్లలనే ఆవాసాలుగా మార్చుకుని జీవనం గడిపారు. కానీ, పంట కాలం కావడం వల్ల.. ఇప్పుడవి సాగుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇలా గుడిసెల నిర్మాణాన్ని ప్రారంభించారు కర్షకులు.
సింఘు సరిహద్దులో అన్నదాతల గుడిసెలు
ఉద్యమం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని రైతులు.. దానికోసమే పక్కా ఇళ్లను నిర్మించుకునేందుకు సిద్ధమవగా.. అధికారులు నిరాకరించారు. వేడి వాతావరణం నుంచి తప్పించుకునేందుకే ఇలా కర్రల సాయంతో గుడిసెలు వేసుకుంటున్నట్టు వారు చెప్పారు. ఇందుకోసం ఓ గుడిసె నిర్మాణానికి సుమారు రూ.20వేల వెదురు కర్రలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రతను భరించలేక మరికొందరు రైతులు మట్టి గుడిసెల్ని కూడా నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎక్స్ప్రెస్ వే దిగ్బంధంతో రైతుల నిరసన
Last Updated : Apr 10, 2021, 2:13 PM IST