సాంకేతికత కొంత పుత్తలు తొక్కుకున్న నేపథ్యంలో రైతులను కూడా అందులో భాగం చేయాలని నిర్ణయించింది గుజరాత్ ప్రభుత్వం. ఇందుకుగాను స్మార్ట్ఫోన్ కొనుగోలు సాయం కింద అక్కడి అన్నదాతలకు సుమారు రూ. 1,500 వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు గుజరాత్ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ సంబంధిత ఆదాయాన్ని మరింత పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది.
భూమి కలిగిన రైతులు ఎవరైనా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది గుజరాత్ వ్యవసాయ శాఖ. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మొత్తం ఖర్చులో రూ.1,500కు మించకుండా 10 శాతం వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తం పొందేందుకు ఐ-కేదుత్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెల్ఫోన్ సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు ఈ పథకం వర్తించదని తెలిపిన ప్రభుత్వం... భూమి కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని అర్హులేనని స్పష్టం చేసింది.