దేశ రాజధాని దిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసింది 20మంది సభ్యులతో కూడిన రైతుల బృందం. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో ఈ బృందం వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం
ఈ బృందంలో హరియాణాకు చెందిన రైతులే అధికంగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కమల్ సింగ్ చవాన్ నేతృత్వంలోని 'ప్రగతిశీల రైతుల' బృందం.. కేంద్ర మంత్రిని కలిసి.. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. వాటిలో కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని సూచించింది. ఈ ప్రతినిధుల బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయాధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధు కూడా ఉన్నారు.