కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకునే మకర సంక్రాంతి, మాఘ్బిహు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శక్తిమంతమైన వారికి వ్యతిరేకంగా రైతులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటువంటి వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని రాహుల్ ట్వీట్ చేశారు.
"రైతులు పండించిన పంట ఇంటికి చేరే కాలం ఇది. సంతోషాల సమయం. ఈ వేళలో రైతులు వారి హక్కుల కోసం దిల్లీ సరిహద్దుల్లో బలమైన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. అందరికీ మకర సంక్రాంతి, పొంగల్, బిహు, భోగి, ఉత్తరాయన్ శుభాకాంక్షలు."