తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్రనేతల భేటీ- రైతు నిరసనలపై చర్చ - farmers protest against new form laws

farmers continuing protests for fourth consecutive day
నాలుగో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

By

Published : Nov 29, 2020, 10:09 AM IST

Updated : Nov 29, 2020, 9:45 PM IST

21:41 November 29

ఆగ్రనేతల భేటీ...

దిల్లీలో రైతు నిరసనల తీవ్రత పెరుగుతున్న తరుణంలో భాజపా అగ్రనేతలు భేటీ అయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, నరేంద్ర సింగ్​ తోమర్​లు సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై వీరందరు చర్చించినట్టు సమాచారం.

20:18 November 29

'మళ్లీ ఉద్రిక్తత...'

దేశ రాజధాని దిల్లీలో రైతు నిరసనలు మరోమారు ఉద్రిక్తతంగా మారాయి. రైతులను అడ్డుకునేందుకు ఘాజీపుర్​ వద్ద బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు-రైతుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

17:30 November 29

'బురారీకి రండి.. చర్చలు జరుపుదాం'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం పునరుద్ఘాటించింది. అయితే ఇందుకోసం రైతులు బురారీ పార్కుకు తరలివెళ్లాలని పేర్కొంది. అక్కడికి రైతులు చేరుకున్న వెంటనే కేంద్ర మంత్రుల బృందం వారితో చర్చలు జరుపుతుందని స్పష్టం చేసింది. 32 రైతు సంఘాలకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.

17:27 November 29

'రాజకీయ నేతలకు అవకాశమివ్వం..'

తమ తరఫున మాట్లాడేందుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలను అనుమతించమని బీకేయూ క్రాంతికారి పంజాబ్​ రాష్ట్ర అధ్యక్షుడు సుర్జీత్​ సింగ్​ వెల్లడించారు. తమ నిబంధనలను పాటిస్తున్న సంఘాలకు మాత్రమే తమ తరఫున మాట్లాడే అవకాశమిస్తామని స్పష్టం చేశారు.

17:14 November 29

'రైతులను అవమానించారు..'

షరతులతో కూడిన చర్చలకు కేంద్రం పిలుపునిచ్చిందని.. ఇది రైతులను అవమానపరచినట్టేనని బీకేయూ క్రాంతికారి పంజాబ్​ రాష్ట్ర అధ్యక్షుడు సుర్జీత్​ సింగ్​ ఫుల్​ మండిపడ్డారు. బురారీకి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. అది పార్కు కాదని.. జైలని ఆరోపించారు. బురారీకి వెళ్లే బదులు.. దిల్లీకి చెరుకునేందుకు ఉపయోగించే ఐదు పాయింట్లను దిగ్బంధిస్తామని తేల్చిచెప్పారు. తమ వద్ద నాలుగు నెలలకు సరిపడా రేషన్​ ఉందని, అందువల్ల చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

16:21 November 29

బురారీ వెళ్లం..

నిరసన చేసేందుకు బురారీ వెళ్లబోమని అంటున్నారు రైతు సంఘాల నేతలు. 30 రైతు సంఘాల ఏకాభిప్రాయం అనంతరం.. తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆ తర్వాతే మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు రైతుల నాయకుడు బల్​దేవ్​ సింగ్​ సిర్సా. 

15:16 November 29

ఛలో దిల్లీ కొనసాగుతుంది: రైతు సంఘాలు

  • ఛలో దిల్లీని కొనసాగించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నిర్ణయం
  • పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల నుంచి రైతులు దిల్లీ బాట పట్టారు
  • చర్చలపై కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు
  • హోంశాఖ, నిఘా వర్గాల ద్వారా కాకుండా అత్యున్నత రాజకీయ నేతల స్థాయిలో చర్చలు జరగాలని డిమాండ్​
  • రైతులంతా పెద్ద సంఖ్యలో దిల్లీ చేరుకోవాలని పిలుపిచ్చిన రైతు పోరాట సమన్వయ సమితి
  • డిసెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
  • చర్చలకు కేంద్రం సిద్దామంటూనే రైతులకు కేంద్రం షరతులు విధించడం సరికాదు: రైతు పోరాట సమన్వయ సమితి
  • నేరుగా వ్యవసాయ చట్టాలపైనే రైతులతో చర్చించాలని డిమాండ్​
  • దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల పోరాట స్ఫూర్తిని అభినందించిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి

14:22 November 29

  • దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • కార్యాచరణపై కొనసాగుతున్న రైతు సంఘాల నేతల భేటీ
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు
  • బురారి నిరంకారి మైదానానికి వెళ్లేందుకు నిరాకరణ
  • దిల్లీ సరిహద్దుల నుంచి నిరంకారి మైదానానికి వెళ్లాలని రైతులను కోరిన అమిత్ షా
  • దిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటున్న రైతులు
  • కేంద్రం తమపై ఆంక్షలు విధిస్తుందన్న రైతులు
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే ఛలో దిల్లీ ప్రధాన అజెండా అంటున్న రైతులు
  • సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్న రైతు సంఘాల నేతలు
  • భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్న రైతు సంఘాల నేతలు
  • 32 పంజాబ్ రైతు సంఘాలను ముందస్తు చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా
  • నిరంకారి మైదానానికి వెళ్లి శాంతియుతంగా నిరసన చేపట్టాలని రైతులకు హోంశాఖ వినతి

13:04 November 29

సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న రైతులకు దిల్లీ సిక్​ గురుద్వారా మేనేజ్​మెంట్​ కమిటీ(డీఎస్​జీఏంసీ) ఆహారాన్ని అందించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వందలాది మంది రైతుల ఆకలి తీర్చింది.

11:52 November 29

సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులు సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై భేటీలో చర్చిస్తున్నారు.

11:44 November 29

  • మధ్యాహ్నం 2 గం.కు రైతు పోరాట సమన్వయ కమిటీ సమావేశం
  • కేంద్రంతో చర్చలు, నిరసన కొనసాగింపుపై రైతు సంఘాల నేతల చర్చలు
  • మధ్యాహ్నం భేటీ తర్వాత తదుపరి నిర్ణయాలు వెల్లడిస్తామన్న రైతు సంఘాలు
  • నిరసనలు కొనసాగిస్తున్న పంజాబ్, హరియాణా, యూపీ రైతులు
  • సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల నిరసనలు
  • నిరంకారి మైదానానికి వెళ్లేందుకు నిరాకరిస్తున్న రైతులు
  • రాజధాని నడిబొడ్డున తమ గళం వినిపించేందుకు అనుమతి ఇవ్వాలంటున్న రైతులు
  • జంతర్ మంతర్ లేదా రాంలీలా మైదానంలో నిరసనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్
  • దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన వేలాది మంది రైతులు
  • నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్‌
  • పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్న రైతులు

10:51 November 29

సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

10:41 November 29

దేశరాజధానిలోకి రైతులను ప్రవేశించకుండా అడ్డుకోవడంపై మండిపడ్డారు శివసేన సీనియర్​ నేత సంజయ్ రౌత్​. రైతులను ఉగ్రవాదులుగా ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. రైతులు పంజాబ్​, హరియాణాకు చెందిన సిక్కులు కావడం వల్లే వారిని ఖలిస్తాని అని పిలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రైతులను అవమానించడమేనని పేర్కొన్నారు.

10:23 November 29

దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం శింఘు వద్ద రైతుల ఆందోళనల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి దేశరాజధాని వెళ్లే సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని దిగ్బంధించడం వల్ల వాహనాల రాకపోకలకు వీలు లేక అవస్థలు పడుతున్నట్లు వారు చెబుతున్నారు.

10:15 November 29

టిక్రి సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

09:57 November 29

దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు నాలుగో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన నిరంకారి మైదానానికి వెళ్లేందుకు వారు నిరాకరిస్తున్నారు.  ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని రైతులు తెలిపారు. 

రైతులతో చర్చలకు సిద్ధమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే ఆందోళన విరమించేందుకు రైతులు నిరాకరిస్తున్నారు.

రైతుల ఆందోళనల నేపథ్యంలో సింఘు సరిహద్దలో పోలీసులు భారీగ మోహరించారు. ముందు జాగ్రత్తగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

Last Updated : Nov 29, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details