రైతు ఉద్యమంలో ఉద్రిక్తత నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడానికి నేర విభాగ అధికారులతో ఘాజిపూర్ సరిహద్దు వద్దకు చేరకుంది ఫోరెన్సిక్ నిపుణుల బృందం.ఈ బృందం వివిధ ప్రాంతాల్లోని నమూనాలను సేకరిస్తోంది.
రైతు దీక్ష: అన్నదాతలకు మద్దతుగా మళ్లీ లోక్‌శక్తి సంఘటన్ - farmers protest live updates
16:13 January 29
15:23 January 29
రైతు ఉద్యమం నుంచి వైదొలిగిన భారతీయ కిసాన్ యూనియన్‌లోని లోక్‌శక్తి సంఘథన్.. మళ్లీ రైతు ఆందోళనకు మద్దతు పలికింది. చిల్లా సరిహద్దు వద్ద నిరసనల్లో పాల్గొననున్నట్లు తెలిపింది.
14:46 January 29
సింఘు సరిహద్దు వద్దు రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ రైతు.. పోలీసు సిబ్బందిపై దాడి చేయగా.. ఆ ఆందోళనకారుడిని బయటకు లాగి లాఠీలతో కొట్టారు పోలీసులు.
14:24 January 29
సింఘు సరిహద్దులో పోలీసులకు, ఆందోళనకారులకు జరిగిన తోపులాటలో అలిపుర్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులను దీక్షా స్థలం నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీ సంఖ్యలో రావడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
14:12 January 29
- సింఘు సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత
- రైతులు సింఘు సరిహద్దు నుంచి వెళ్లిపోవాలంటూ స్థానికుల ఆందోళన
- సింఘు ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్
- రైతుల గుడారాలు తొలగించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు
- రాళ్లు రువ్వుకున్న స్థానికులు, రైతు ఆందోళనకారులు
- లాఠీచార్జి చేసిన పోలిసులు
- పరిస్థితిని అదుపు చేసేందుకు భాష్పవాయుగోళాల ప్రయోగం
- స్థానికులను సముదాయిస్తున్న పోలీసు బలగాలు
- ఆందోళనకారులు సైతం దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని కోరిన పోలీసులు
13:59 January 29
సింఘు సరిహద్దులో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళకారులపై లాఠీ ఛార్జ్ చేశారు దిల్లీ పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.
13:53 January 29
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని స్థానికుల పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల గుడారాలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది.
13:33 January 29
సింఘు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతోన్న రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది స్థానికులు ర్యాలీ చేపట్టారు. సరిహద్దు వద్దకు వచ్చి నినాదాలు చేశారు.
12:29 January 29
రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దును దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా సందర్శించారు. రైతుల కోసం తాము చేసిన నీరు, టాయిలెట్ ఏర్పాట్లను పరిశీలించేందుకే వచ్చినట్లు చెప్పారు. వాటర్ ట్యాంకర్లు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని, అందుకే అవి సింఘు సరిహద్దుకు చేరుకోలేదని తెలిపారు.
12:26 January 29
రైతులు ఆందోళనలు చేస్తున్న ఘాజీపుర్ సరిహద్దును దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సందర్శించారు. దీక్షా శిబిరం వద్ద రైతులకు నీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించేలా గురువారం రాత్రి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆ పనులను పరిశీలించేందుకు తాను అక్కడికి వచ్చినట్లు తెలిపారు.
10:54 January 29
- ఈనెల 26న రైతుల పరేడ్ సందర్భంగా జరిగిన ఘటనలపై విచారణ ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్
- ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆరుగురు రైతు నేతలకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్
- దర్శన్ పాల్ సింగ్, రాకేష్ టికాయత్ సహా ఆరుగురు నేతలను విచారణకు పిలిచిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్
10:40 January 29
జనవరి 26న ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేసిన ఘటనతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ నటుడు దీప్ సిద్దూ.. తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపాడు. అయితే కొన్ని నిజాలు బయటకు తీయాల్సి ఉందని, ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని చెప్పాడు.
10:18 January 29
దీక్షా శిబిరాలను ఖాళీ చేయించాలని అధికారులపై ఒత్తిడి ఉండవచ్చు కానీ, ఈ ప్రదేశాన్ని వీడేందుకు రైతులు సిద్దంగా లేరని ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కచ్చితంగా లేవనెత్తాలన్నారు. సాగు చట్టాల విషయంలో కేంద్రం వెనక్కితగ్గితే అది బలహీనతను సూచించదని, వారి నాయకత్వ హుందాను పెంచుతుందన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ నోరు మెదపాలని, రైతుల విశ్వాసాన్ని చూరగొనాలని తెలిపారు.
10:12 January 29
రైతులు ఆందోళనలు చేస్తున్న ఘాజీపుర్ సరిహద్దుకు భారీ సంఖ్యలో మద్దతుదారులు చేరుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌తో మాట్లాడేందుకు ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి దీక్షా శిబిరానికి వచ్చారు.
10:02 January 29
దిల్లీ సరిహద్దులో దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. రైతులు శాంతియుతంగా ఉండాలని కోరారు.
09:20 January 29
రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దులో బలగాల మోహరింపు కొనసాగుతోంది. నిరసనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం.
08:22 January 29
అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో పటిష్ఠ భద్రత చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. టిక్రి సరిహద్దులో రైతుల దీక్షా శిబిరం వద్ద మోహరించిన బలగాలను యథావిధిగా కొనసాగిస్తోంది.
08:08 January 29
ఘాజీపుర్ సరిహద్దులో జై జవాన్, జై కిసాన్, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు రైతులు. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
07:53 January 29
సింఘు సరిహద్దు: బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు నెలలకు పైగా దిల్లీ సరిహద్దులో దీక్ష చేపట్టిన రైతులు.. చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతం ఘాజీపుర్‌లో బైఠాయించిన రైతులు..తాము వెనక్కి వెళ్లబోమని స్పష్టం చేశారు. చలిలోనే దుప్పట్లు కప్పుకొని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. గురువారం అర్ధరాత్రి కూడా నిరసనలు కొనసాగించారు. దీంతో యూపీ ప్రభుత్వం సరిహద్దులో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకుంది.