తెలంగాణ

telangana

రైతు నిరసనలు ఉద్ధృతం- 14న దేశవ్యాప్త ఆందోళనలు

By

Published : Dec 9, 2020, 8:14 AM IST

Updated : Dec 9, 2020, 5:43 PM IST

Farmers continue to camp at Singhu border to protest against the farm laws
దిల్లీ సరిహద్దులో 14వ రోజుకు చేరిన అన్నదాతల దీక్ష

17:41 December 09

రైతుల కార్యచరణ ఇదే..

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సవరణలను తిరస్కరిస్తున్నట్లు దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించిన రైతు సంఘాల నేతలు వాటిని ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. 

ఈ నెల 14న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 12 వరకు దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు. 

  • 12వ తేదీన దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం: రైతు సంఘాలు
  • 12వ తేదీ తర్వాత భాజపా నేతలను ఘెరావ్ చేస్తాం: రైతు సంఘాలు
  • 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం: రైతు సంఘాలు
  • వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం: రైతు సంఘాలు
  • ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాలి: రైతు సంఘాలు

17:29 December 09

అమిత్​ షా నివాసానికి తోమర్​..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో.. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ సమావేశం కానున్నారు. షా నివాసానికి ఆయన చేరుకున్నారు.  

17:28 December 09

విపక్షాల మీడియా సమావేశం..

  • వ్యవసాయ చట్టాల గురించి రాష్ట్రపతికి వివరించాం: రాహుల్‌గాంధీ
  • కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం: రాహుల్‌గాంధీ
  • రైతులు నష్టపోయేలా ఉన్న వ్యవసాయ చట్టాలు తెచ్చారు: రాహుల్‌గాంధీ
  • వణికించే చలిలోనూ రైతులు అహింసా మార్గంలో పోరాడుతున్నారు: రాహుల్​
  • రైతులకు దేశమంతా అండగా నిలవాల్సిన సమయమిది: రాహుల్‌గాంధీ

ఏచూరి..

కేంద్రం అప్రజాస్వామికంగా కొత్త చట్టాలు చేసింది: సీతారాం ఏచూరి

17:28 December 09

రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు..

  • రాష్ట్రపతితో ముగిసిన విపక్షనేతల సమావేశం
  • రైతుల ఆందోళనల గురించి రాష్ట్రపతికి వివరించిన విపక్ష నేతలు
  • రాష్ట్రపతిని కలిసిన రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, డి.రాజా, సీతారాం ఏచూరి, డీఎంకే ప్రతినిధి

17:18 December 09

కార్యచరణ ప్రకటించిన రైతు సంఘాలు..

కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు.. తమ తదుపరి కార్యచరణను ప్రకటించాయి. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నాయి. ఆ చట్టాలు రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. 

  • డిసెంబర్​ 12 వరకు దిల్లీ- జైపుర్, దిల్లీ-ఆగ్రా​ జాతీయ రహదారుల దిగ్బంధం: రైతు సంఘాలు
  • 12వ తేదీన దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం: రైతు సంఘాలు
  • 12వ తేదీ తర్వాత భాజపా నేతలను ఘెరావ్ చేస్తాం: రైతు సంఘాలు
  • 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం: రైతు సంఘాలు
  • వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం: రైతు సంఘాలు
  • ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాలి: రైతు సంఘాలు

ఒక్కొక్కటిగా దిల్లీలోని అన్ని ప్రధాన రహదారుల్ని అడ్డుకుంటామని రైతు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. 

17:07 December 09

ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాం..

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు క్రాంతికారి కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు దర్శన్​ పాల్​ స్పష్టం చేశారు. దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద ఆయన మాట్లాడారు.  

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు ప్రతినిధులు. 

డిసెంబర్​ 12 లోపు దిల్లీ-జైపుర్​ జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్లు తమ కార్యచరణ ప్రకటించారు. 

16:37 December 09

రాష్ట్రపతి భవన్​లో రాహుల్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. దిల్లీ రాష్ట్రపతి భవన్​కు చేరుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్రపతితో విపక్షాలు సమావేశంకానున్నాయి.

15:58 December 09

ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు..

  • కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
  • మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల డిమాండ్‌
  • చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపిన కేంద్రం
  • ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామన్న కేంద్రం
  • ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ చేస్తామన్న కేంద్రం
  • ఏపీఎంసీల్లో ఒకే పన్ను ఉంటుందన్న సవరణ చేస్తామని కేంద్రం ప్రతిపాదన
  • ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తామన్న కేంద్రం
  • ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామన్న కేంద్రం
  • కేంద్రం సూచించిన అన్ని ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
  • కొత్త చట్టాల రద్దు తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదన్న రైతు సంఘాలు
  • సింఘు సరిహద్దు వద్ద జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్న రైతు సంఘాలు
  • సాయంత్రం 5 గం.కు మీడియాతో మాట్లాడనున్న రైతు సంఘాల నేతలు

11:44 December 09

  • చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘలాకు పంపిన కేంద్రం
     
  • ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామన్న కేంద్రం
     
  • ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలకు కేంద్ర సుముఖత
     
  • ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్ ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకూలం
     
  • ప్రైవేటు కొనుగోలుదారులను రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసేలా సవరణ
     
  • ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామన్న కేంద్రం
     
  • వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డీఎంల అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత
     
  • ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణ
     
  • ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ
     
  • కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదన
     
  • పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చిన కేంద్రం
     
  • 12 గంటల తర్వాత కేంద్ర ప్రతిపాదనలపై భేటీ కానున్న రైతు సంఘాలు
     
  • రాతపూర్వక కేంద్ర ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న రైతు సంఘాలు
     
  • సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో రైతు సంఘాలు నిర్ణయం వెల్లడించే అవకాశం
     
  • కేంద్ర ప్రతిపాదనల నేపథ్యంలో మరో దఫా చర్చలకు అవకాశం లేదంటున్న రైతు సంఘాలు
     
  • కేంద్ర వైఖరిని బట్టి ఆందోళనలను ముందుకు తీసుకెళ్లే అంశంపై నిర్ణయం ఉంటుందన్న రైతు సంఘాలు
  • ప్రభుత్వ, ప్రయివేటు మార్కెట్లలో ఒకే ట్యాక్స్ ఉండేలా సవరణకు ప్రతిపాదన

11:01 December 09

కేంద్రం తమకు లిఖిత పూర్వకంగా పంపే అంశాలు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు సంబంధించినవై ఉంటేనే వాటి గురించి ఆలోచిస్తామని చెప్పారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హనన్​ మొల్లా. లేకపోతే తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి లేఖ తమకు అందలేదని తెలిపారు. ఒక వేళ లేఖ వస్తే సానుకూల సంకేతంగా భావిస్తామని, రేపు కేంద్రంతో సమావేశమవుతామని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రైతు  సంఘాల నేతలంతా సమావేశమై తదుపరి కార్యచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

10:12 December 09

  • ఉదయం 11 గంటలకు రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపనున్న కేంద్రం
  • కొత్త సాగు చట్టాల్లో పలు సవరణలకు అంగీకరిస్తూ ప్రతిపాదనలు
  • ప్రభుత్వ మార్కెట్ కమిటీలపై బలోపేతానికి హామీ ఇచ్చేలా కేంద్రం ప్రతిపాదన
  • కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీతో మరో ప్రతిపాదన
  • విద్యుత్ బిల్లుపై రైతులతో చర్చించేలా ప్రతిపాదన
  • మరికొన్ని ప్రతిపాదనలను రైతు సంఘాల ముందు ఉంచనున్న కేంద్రం
  • చట్టాల రద్దు కుదరదని నిన్న రైతు సంఘాలతో చెప్పిన అమిత్ షా
  • కేంద్రం ప్రతిపాదనలు అందిన తర్వాత భేటీకానున్న రైతు సంఘాలు
  • కేంద్రం ప్రతిపాదనలు పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామన్న రైతు సంఘాలు

08:00 December 09

సింఘు సరిహద్దులో 14 రోజూ ఆందోళనలు చేస్తున్నారు రైతులు. ఎముకలు కొరికే చలిలోనూ మొక్కవోని దీక్షతో వ్యవసాయ చట్టాలు రద్దుకు డిమాండ్ చేస్తున్నారు.

07:54 December 09

14వ రోజుకు చేరిన రైతుల దీక్ష

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో  రైతుల ఆందోళన 14వ రోజూ కొనసాగుతోంది. ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు, టిక్రి, ఘాజిపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై బైఠాయించిన రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలని నినదించాయి. కొత్త చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పిన నేపథ్యంలో రైతు సంఘాలు నేడు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సింఘు సరిహద్దు వద్ద సమావేశం కానున్న రైతు సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నాయి.

Last Updated : Dec 9, 2020, 5:43 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details