వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో గత కొద్ది నెలలుగా చేపడుతున్న నిరసనను రైతులు ఇప్పట్లో విరమించేలా లేరు. వేసవి కూడా దగ్గర పడుతుండటం వల్ల అన్నదాతలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద ఇళ్లు నిర్మించుకుని వాటిలో సేద తీరుతున్నారు.
సింఘూ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం - సరిహద్దుల్లో ఇళ్ల నిర్మాణం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన సాగిస్తున్న రైతులు వేసవిలో భానుడి భగభగలు తట్టుకునేందుకు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద తాత్కాలిక ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. టిక్రీలో ఇప్పటికే శాశ్వత గృహాల నిర్మాణం చేపట్టారు.
సింఘూ సరిహద్దుల్లో అన్నదాతల ఇళ్ల నిర్మాణం
టిక్రీ సరిహద్దు వద్ద ఏకంగా శాశ్వత ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 25 గృహాలు నిర్మించారు. రానున్న రోజుల్లో 1000 నుంచి 2 వేల ఇళ్లను నిర్మించుకోనున్నట్లు రైతు నేతలు స్పష్టం చేశారు. మరికొన్ని చోట్లట్రాక్టర్ ట్రాలీలనే ఇళ్లగా మార్చి అందులో ఏసీ, ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి :చాక్లెట్ సంస్థ క్యాడ్బరీ ఇండియాపై కేసు: సీబీఐ