తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు పోరు: దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో రైతులు బారికేడ్లను దాటుకుని దిల్లీలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

By

Published : Jan 26, 2021, 10:47 AM IST

delhi, farmers
దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. బారికేడ్లు దాటుకుని నగరంలోకి రైతులు

రైతు సంఘాల ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని నగరంలోకి ప్రవేశించడానికి యత్నించారు.

నిరసన తెలుపుతున్న రైతులు

ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణపై భద్రత సిబ్బంది రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజపథ్​​లో కవాతు ముగియగానే నిరసన నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ కొందరు రైతులు అవేం పట్టించుకోకుండా బారికేడ్లు దాటుకుని ఔటర్​ రింగ్​ రోడ్డు వైపుగా వెళ్లసాగారు.

-అధికారులు

ఈ ఘటనపై సంయుక్త్​ కిసాన్​ మోర్చా స్పందించింది. బారికేడ్లు దాటేందుకు యత్నించిన వారు కిసాన్​ మజ్​దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన వారని పేర్కొంది. తమ రైతు సంఘం ర్యాలీ పోలీసులు అనుమతించాకే ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

గణతంత్ర దినోత్సవం రోజు ఔటర్​ రింగ్​ రోడ్డులో కవాతు నిర్వహిస్తామని కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సోమవారం స్పష్టంచేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతామని రైతు సంఘాలు ప్రకటించాయి.

ఇదీ చూడండి :గణతంత్ర కవాతుకు సిద్ధమైన రైతులు

ABOUT THE AUTHOR

...view details