సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 'మహా పంచాయత్' పేర మరో రూపు దాల్చాయి. కేంద్రం, రైతులకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో రైతు సంఘం నాయకులు వరుసగా మహా పంచాయత్లను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన తేదీలను ప్రకటించించారు. వీటిని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మార్చ్ 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్ అన్నీ మహా పంచాయత్లల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
మహా పంచాయత్ల షెడ్యూల్ ఇదే..
మార్చి 1-రుద్రపుర్, ఉత్తరాఖండ్
మార్చి 2-ఝున్ఝును, రాజస్థాన్
మార్చి 3-నాగౌర్, రాజస్థాన్
మార్చి 5- ఇటావా, ఉత్తర్ప్రదేశ్
మార్చి 6- తెలంగాణ