లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 8న పంజాబ్‌లోని నిరసన చేపట్టనున్నట్లు రైతు సంఘాలు బుధవారం తెలిపాయి. కొత్త సాగు చట్టాల రద్దుకు కొంతకాలంగా ఆందోళన చేపడుతున్న రైతు నేతలు ఈ మేరకు పిలుపునిచ్చారు. సింఘు సరిహద్దు ప్రాంతం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం) తరపున రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ విలేకరులతో మాట్లాడారు.
లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతుల నిరసన!
లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా.. ఈ నెల 8న పంజాబ్‌లోని వీధుల్లో నిరసన చేపట్టనున్నట్లు రైతు సంఘాలు బుధవారం తెలిపాయి. కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, రైతుల ఉద్యమాన్ని బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించాయి.
లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన
కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, రైతుల ఉద్యమాన్ని బలహీనపరచాలని చూస్తోందని బల్బీర్ సింగ్ ఆరోపించారు. పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటాయని తెలిపారు. లాక్‌డౌన్‌ను పాటించవద్దని, షాపులన్నీ తెరవాలని ప్రజలను కోరుతామన్నారు.
ఇదీ చూడండి:విదేశాల సాయం వివరాలెక్కడ?: రాహుల్