ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్లో దారుణం జరిగింది. కొత్వాలి సాస్ని ప్రాంతంలోని నౌజర్పుర్ గ్రామంలో ఓ రైతును.. అతని పొలంలోనే కాల్చి చంపారు కొందరు దుండగులు. పాత కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పాత కక్షలే కారణమా?
నిందితుడు గౌరవ్ శర్మ, మరణించిన రైతు అమ్రిశ్ కుమార్ శర్మ(48)కు మధ్య పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన కుమార్తెను కొందరు వేధిస్తున్నారని 2018లో రైతు(మృతుడు) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేశారు.
తాజాగా ప్రధాన నిందితుడు గౌరవ్ భార్య, అత్త.. అటు రైతు కుమార్తెలు ఇద్దరు సోమవారం దేవాలయానికి వెళ్లారు. అక్కడే పాత గొడవలు కదిలి.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న గౌరవ్కు తెలిసింది. దీంతో పొలంలో బంగాళదుంపలు తవ్వుతున్న రైతు దగ్గరకు తన అనుచరులతో వెళ్లి దాడి చేశాడు. ఈ క్రమంలోనే గౌరవ్ కాల్పులు జరిపాడన్నది రైతు కుమార్తె ఆరోపణ. గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.