తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులు దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారా?

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నారు రైతులు. ఈనెల 6న బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​ గాజీపుర్​లో నిర్వహించిన సభలో చాలా తక్కువ మంది రైతులు కనిపించారు. ఈ క్రమంలో రైతుల సంఖ్య తగ్గుతోందా? నిరసన ప్రాంతం నుంచి రైతులు వెనుదిరుగుతున్నారా? దీనికి రైతు నేతలు చెబుతున్నదేమిటి?

Farmer numbers thinning at Ghazipur border
గాజీపుర్​లో తగ్గుతున్న రైతుల సంఖ్య!

By

Published : Apr 8, 2021, 9:19 AM IST

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. వేల మంది రైతులు సరిహద్దుల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని నెలల తరబడి నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే.. గాజీపుర్​​ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతుల సంఖ్య తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. డిసెంబర్​, జనవరిలో ఉన్నంతగా.. ప్రస్తుతం అక్కడ రైతులు లేనట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​.. వివిధ రాష్ట్రాల్లో 'మహాపంచాయత్​' కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా తమ ఆందోళన.. దిల్లీకి మాత్రమే పరిమితం కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈనెల 6న.. గాజీపుర్​ సరిహద్దు వద్దకు రాకేశ్ టికాయిత్​ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. అయితే.. సభ చాలా వరకు ఖాళీగా కనిపించింది. రైతులు కొద్ది మందే హాజరవ్వటం పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై రాకేశ్​ టికాయిత్​ను ప్రశ్నించగా.. పంటల కోత కోసమే రైతులంతా తమ స్వస్థలాలకు వెళ్లారని, త్వరలోనే వారు మళ్లీ తిరిగి వస్తారని ​చెప్పారు.

రాకేశ్​ టికాయిత్​ సభలో తక్కువ సంఖ్యలో కనిపిస్తున్న రైతులు

"ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో ఉంది. అదే విధంగా మా రైతులు.. గోధుమ కోతల కోసం తమ గ్రామాలకు వెళ్లారు. నెల తర్వాత ప్రభుత్వం మళ్లీ దిల్లీకి వస్తుంది. అప్పుడు రైతులు కూడా గాజీపుర్​కు తరలివస్తారు. ప్రస్తుతం పంటపనులు చాలా ఉన్నాయి. అందుకే రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు."

-రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ వందలాది మంది రైతులు.. గతేడాది నవంబర్​ నుంచి దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు.

ఇదీ చూడండి:హరియాణాలో రైతులపైకి జల ఫిరంగుల ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details