Samyukt Kisan Morcha Statement: రైతు సంఘాలన్నింటినీ కలిపి జాతీయ స్థాయి రైతు సంఘటిత శక్తిగా మార్చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా సన్నద్ధమవుతుందని ఆ సంఘం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే కర్షక నాయకులు యూనియన్‌ను వీడాలని స్పష్టం చేశారు. రైతు సంఘం రాజకీయాలకు అతీతంగా ఉండాలని పునరుద్ఘాటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Farmers Protest News: మరోవైపు.. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందా? లేదా? అని సమీక్షించేందుకు వచ్చే ఏడాది జనవరి 15న సమావేశం కావాలని ఎస్‌కేఎం నిర్ణయించింది.
"జనవరి 15 సమావేశంలో ఎస్‌కేఎంని జాతీయ స్థాయి మోర్చాగా ఏ విధంగా మార్చాలనే అంశంపై చర్చిస్తాం. రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే రైతు నాయకులు ఎస్‌కేఎంని నుంచి బయటకు వెళ్లాలి. ఈ సంఘం రాజకీయాలకు దూరంగా ఉంటుంది"
---దర్శన్పాల్