ఇంటి కరెంట్ బిల్లు రూ.1500 వస్తే.. పొరపాటుగా రూ.1,50,000 అని వేశారు విద్యుత్ శాఖ అధికారులు. బిల్లు కట్టలేనని చెప్పిన ఆ రైతును కుటుంబ సభ్యుల ముందే కొట్టారు. మనస్తాపం చెందిన ఆ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అత్రౌలీ తెహ్సిల్‌లో శనివారం జరిగింది.
సునైరా గ్రామానికి చెందిన ఆ రైతు పేరు రామ్‌జీ లాల్. అతనికి ఇంటి విద్యుత్ బిల్లు రూ.1,50,000 వచ్చింది. అయితే తనకు అంత బిల్లు రాలేదని, ఆ డబ్బు కట్టే స్థోమత తన దగ్గరలేదని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నాడు. అయితే, ఆయన అభ్యర్థనను పక్కనబెట్టి.. కుటుంబ సభ్యుల ముందే కొట్టారు. మనస్థాపంతో రామ్‌జీ లాల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.