దిల్లీ సింఘు సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనల్లో మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని లుథియానాకు చెందిన లాభ్ సింగ్.. విషం తాగేశాడు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు తోటి అన్నదాతలు. అప్పటికే అతని పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు లాభ్ సింగ్. దీంతో సింఘు సరిహద్దులో ఇప్పటివరకు 11 మంది కర్షకులు ప్రాణాలు కోల్పోయారు.
టిక్రీ సరిహద్దుల్లో మరొకరు