కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి కుమారుడు చిదానంద సవాడీ కారు ఢీకొని కుదలెప్ప బోలి అనే రైతు మరణించారు. ఈ ఘటన బాగల్కోట్ జిల్లాలోని హునగుండ తాలూకాలో జరిగింది. సోమవారం సాయంత్రం పొలం నుంచి తిరుగు పయనమైన రైతు బైక్‌ను సవాడి కారు ఢీకొట్టింది. దీంతో కుదలెప్పకు తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ క్రమంలో రైతును స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఘటనా స్థలం నుంచి ఉపముఖ్యమంత్రి కుమారుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్థానికుల చెప్పారు. డిప్యూటీ సీఎం కొడుకును స్థానికులు అడ్డుకోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హనుగుండా పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు... ఎవరు గుర్తుపట్టకుండా కారు నెంబర్ ప్లేట్‌ను నిందితుడు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు కాకుండా ఉండేలా మృతుని బంధువులను సవాడి బెదిరించారని ఆరోపించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి పర్యటక ప్రాంతాలకు వెళ్లి వస్తున్నట్లు సవాడి చెప్పారు.
నేను ఎవరినీ బెదిరించలేదు..